Mermaid : సముద్రాల్లో అనేక జీవులు నివసిస్తుంటాయి. వాటిల్లో మత్స్యకన్యలు ఒకటి. పైభాగం మనిషిగా.. నడుము నుంచి కింది భాగం చేపగా ఉంటుంది. ఈ ఆకారంతో కూడిన వారిని మనం నిజ జీవితంలో ఇప్పటి వరకు చూడలేదు. సినిమాల్లోనే చూశాం. దీంతో అసలు మత్స్య కన్యలు ఉన్నారా.. అన్న అనుమానాలు కూడా ఇప్పటికీ చాలా మందికి కలుగుతూనే ఉన్నాయి. అయితే ఆ అనుమానాలకు సమాధానం ఇప్పుడు దొరికిందనే చెప్పవచ్చు. ఎందుకంటే జపాన్‌లో 300 ఏళ్ల కిందటి ఓ మత్స్యకన్య లభ్యం కాగా సైంటిస్టులు దానిపై ప్రయోగాలు చేస్తున్నారు.

1736 నుంచి 1741 వరకు జపాన్‌కు చెందిన షికోకు అనే దీవికి సమీపంలో ఉన్న పసిఫిక్ మహాసముద్రంలో ఓ మత్స్యకన్య తిరిగింది. దాని పొడవు 12 ఇంచులు. అది పై భాగంలో మనిషిగా.. కింది భాగంలో చేపగా ఉంది. అయితే అప్పట్లో ఈ మత్స్యకన్య చనిపోగా.. దాన్ని కొందరు స్థానికులు మమ్మీ రూపంలో భ్రదపరిచారు. తరువాత అది కొందరి చేతులు మారింది. ప్రస్తుతం ఆ మత్స్యకన్య మమ్మీ జపాన్‌లోని అసకుచి నగరంలో ఉన్న ఓ టెంపుల్‌లో ఉంది.
కాగా ఆ మత్స్యకన్య మమ్మీకి కురషికి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్‌కు చెందిన పరిశోధకులు పలు పరీక్షలు చేస్తున్నారు. ఈ మధ్యే వారు ఆ మత్స్యకన్య మమ్మీని స్వాధీనం చేసుకున్నారు. అయితే దాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారు. పై భాగం మనిషిగా.. కింది భాగం చేపగా ఉండడంతో వారు షాక్‌కు గురయ్యారు.
ఇక మత్స్యకన్యల గురించి జపాన్ లో ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. మత్స్యకన్యల మాంసం తింటే 800 ఏళ్ల వరకు జీవిస్తారని చెబుతారు. అక్కడ కొందరు అలాగే తిని 800 ఏళ్లకు పైగా జీవించారట. దీంతో మత్స్యకన్యల గురించి ఇలాంటి కథలు ఎన్నో అక్కడ ప్రచారంలో ఉన్నాయి. కాగా ఆ మత్స్యకన్యపై పరీక్షలు జరిపి సైంటిస్టులు త్వరలోనే వివరాలను వెల్లడించనున్నారు.