Rashmika Mandanna : టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్ల జాబితాలో రష్మిక మందన్న ఒకరు. ఈమె నటించిన అనేక చిత్రాలు హిట్ అయ్యాయి. ఛలో, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప.. ఇలా అనేక చిత్రాలు హిట్ అయ్యాయి. ఆ మధ్య వచ్చిన డియర్ కామ్రేడ్ అనే ఒక్క సినిమా తప్పితే రష్మిక మందన్న నటించిన అనేక చిత్రాలు హిట్ అయ్యాయి. దీంతో ఈమె గోల్డెన్ లెగ్ అన్న ముద్రను సంపాదించుకుంది. అందులో భాగంగానే ఈమెకు ప్రస్తుతం వరుస ఆఫర్లు వస్తున్నాయి.

అయితే 2021లో రష్మిక మందన్నకు అనేక హిట్లు వచ్చినా.. 2022లో మాత్రం ఆరంభంలోనే ఈమెకు ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఈమె తాజాగా నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు.. అనే సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ ఏడాది ఈమెకు మొదట్లోనే షాక్ తగిలిందని చెప్పవచ్చు. అయితే ఈమెకు ఇప్పటికప్పుడు వచ్చిన ఇబ్బందేమీ లేదు. కానీ వరుసగా 2, 3 సినిమాలు ఫ్లాప్ అయితే మాత్రం ఈమెకు ఉన్న గోల్డెన్ లెగ్ అన్న ముద్ర కాస్తా.. ఐరన్ లెగ్ అనే ముద్రగా మారిపోతుందని అంటున్నారు.
ఇక రష్మిక మందన్న ప్రస్తుతం పుష్ప రెండో పార్ట్‌లో నటిస్తుండగా.. మిషన్ మజ్ను, గుడ్ బై అనే హిందీ మూవీల్లోనూ యాక్ట్ చేస్తోంది. ఇవన్నీ ఈ ఏడాది విడుదల కానున్న చిత్రాలు. మరి ఈమె లక్ ఈ ఏడాది ఎలా ఉంటుందో చూడాలి.