Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Mini Aloo Samosa : మినీ ఆలూ సమోసా.. పర్‌ఫెక్ట్‌గా.. క్రిస్పీగా.. రావాలంటే.. ఇలా చేయండి..!

D by D
April 28, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Mini Aloo Samosa : మ‌న‌కు సాయంత్రం స‌మ‌యాల్లో టీ షాపుల్లో, హోట‌ల్స్ లో ల‌భించే చిరుతిళ్ల‌ల్లో స‌మోసాలు కూడా ఒక‌టి. స‌మోసాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే మ‌న‌కు స‌మోసాల‌తో పాటు మినీ స‌మోసాలు కూడా ల‌భిస్తూ ఉంటాయి. ఇవి స‌మోసాలే కానీ చూడ‌డానికి చిన్న‌గా ఉంటాయి అంతే. ఈ మినీ స‌మోసాల‌ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఇంట్లోనే సులభంగా మినీ స‌మోసాల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మినీ ఆలూ స‌మోసా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మైదాపిండి – రెండు క‌ప్పులు, క‌ళోంజి విత్త‌నాలు – పావు టీ స్పూన్, జీల‌క‌ర్ర – పావు టీ స్పూన్, వాము – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Mini Aloo Samosa recipe in telugu make in this method
Mini Aloo Samosa

ఆలూ కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన బంగాళాదుంప‌లు – 6, నూనె – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, దంచిన ధ‌నియాలు – ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి -ఒక టీ స్పూన్, చాట్ మ‌సాలా – అర టీ స్పూన్, చిన్న ముక్క‌లుగా త‌రిగిన క్యారెట్ – 1, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

మినీ ఆలూ స‌మోసా త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో పిండిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో నూనె త‌ప్ప మిగిలిన ప‌దార్థాలన్నీ వేసి క‌ల‌పాలి. త‌రువాత త‌గినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని క‌లుపుకోవాలి. త‌రువాత దీనిపై మూత‌ను ఉంచి పిండిని 10 నిమిషాల పాటు నాన‌బెట్టుకోవాలి. త‌రువాత ఉడికించిన బంగాళాదుంప‌ల‌ను మెత్త‌గా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ధ‌నియాలు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, క్యారెట్ ముక్క‌లు, అల్లం పేస్ట్ వేసి వేయించాలి. త‌రువాత ఉప్పు, కారం, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి, చాట్ మ‌సాలా వేసి క‌ల‌పాలి. త‌రువాత మెత్త‌గా చేసుకున్న బంగాళాదుంప‌లు వేసి క‌ల‌పాలి. దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన త‌రువాత కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

త‌రువాత పిండిని తీసుకుని మ‌రోసారి క‌ల‌పాలి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. త‌రువాత ఒక్కో ఉండ‌ను తీసుకుని చ‌పాతీలా వ‌త్తుకోవాలి. త‌రువాత దీనిని మ‌ధ్య‌లోకి క‌ట్ చేసుకుని అంచుల‌కు త‌డి చేసుకోవాలి. త‌రువాత దీనిని స‌మోసాలా మడుచుకుని అందులో బంగాళాదుంప మిశ్ర‌మాన్ని ఉంచాలి. త‌రువాత అంచుకుని వ‌త్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక స‌మోసాల‌ను వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మినీ స‌మోసాలు త‌యార‌వుతాయి. వీటిని ట‌మాట కిచ‌ప్ తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. సాయంత్రం స‌మ‌యాల్లో స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి.

Tags: Mini Aloo Samosa
Previous Post

Moduga Chettu : ఈ చెట్టులో ఉన్న ఆరోగ్య ర‌హ‌స్యాల గురించి తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు.. ఎలా ఉప‌యోగ‌ప‌డుతుందో తెలుసా..?

Next Post

Phool Makhana Masala Curry : ఫూల్ మఖ‌న‌ మసాలా కర్రీ..అన్నం, చపాతీ, బిర్యానీలోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Related Posts

ఆధ్యాత్మికం

ఈ పొర‌పాట్ల‌ను మీరు కూడా చేస్తున్నారా..? అయితే మీ ఇంట్లో ధ‌నం నిల‌వ‌దు జాగ్ర‌త్త‌..!

July 4, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీపై ల‌క్ష్మీదేవి క‌టాక్షం వ‌ర్షిస్తుంది..!

July 4, 2025
vastu

వాస్తు ప్రకారం ఈ మొక్క‌ల‌ను ఇంటి ప్ర‌ధాన ద్వారం వద్ద పెంచ‌కూడ‌దు..!

July 4, 2025
వినోదం

తండ్రి కొడుకులు కలిసి నటించినా హిట్ చేసుకోలేక డిజాస్టర్లు గా మిగిలిపోయిన సినిమాలు !

July 4, 2025
వినోదం

హీరో అవ్వకముందు చిరంజీవి – కమెడియన్ సుధాకర్ ఇన్ని కష్టాలని పడ్డారా ?

July 4, 2025
వినోదం

జై చిరంజీవ లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తు పట్టారా ? ఇప్పుడెలా మారిపోయిందంటే ?

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.