OTT : ప్రతి శుక్రవారం కొత్త కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేస్తుంటాయి. అలాగే ఓటీటీల్లోనూ సినిమాలను స్ట్రీమ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ శుక్రవారం కూడా రెండు ముఖ్యమైన సినిమాలు ఓటీటీలలో స్ట్రీమ్ కానున్నాయి. ఈ రోజు నుంచి ఓటీటీల్లో స్ట్రీమ్ కానున్న సినిమాలు, సిరీస్‌ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించిన జల్సా అనే మూవీ శుక్రవారం ఓటీటీలోనే నేరుగా విడుదలవుతోంది. డ్రామా థ్రిల్లర్ జోనర్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజ్ కానుంది.
కిరణ్ అబ్బవరం, కోమలీ ప్రసాద్‌లు ప్రధాన పాత్రల్లో వచ్చిన సెబాస్టియన్ పి.సి.524 అనే మూవీ కూడా శుక్రవారం ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. ఆహా వీడియోలో ఈ మూవీని స్ట్రీమ్ చేయనున్నారు. థ్రిల్లర్, కామెడీ కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మూడు వారాల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి వస్తుండడం విశేషం.
ఇక ఇవే కాకుండా నెట్ ఫ్లిక్స్‌లో విండ్ ఫాల్ అనే క్రైమ్, డ్రామా, థ్రిల్లర్ సినిమాను స్ట్రీమ్ చేయనున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో లలిత సుందరం అనే సినిమా స్ట్రీమ్ కానుంది. కామెడీ మూవీగా ఇది ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆహా ప్లాట్‌ఫామ్‌లో జూన్ అనే టీవీ షో ప్రసారం కానుంది. అమెజాన్‌లో డీప్ వాటర్ అనే థ్రిల్లర్ మూవీ ప్రసారం కానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో బ్లాక్ క్రాబ్ అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమ్ కానుంది.