Barley Water : బార్లీ గింజల గురించి చాలా మందికి తెలియదు. కానీ ఇవి అందించే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు మాత్రం అధికంగా ఉంటాయి. ఇవి చూసేందుకు అచ్చం గోధుమ గింజలను పోలి ఉంటాయి. కానీ వీటిని పిండిగా చేసి తీసుకోలేరు. కాకపోతే వీటిని నీటిలో వేసి మరిగించి.. అనంతరం అందులో నిమ్మరసం, తేనె కలిపి రోజూ తాగవచ్చు. ఇలా రోజూ బార్లీ గింజల నీటిని ఒక గ్లాస్ మోతాదులో తాగితే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. బార్లీ గింజల నీళ్లను రోజూ తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు అన్నీ బయటకు పోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. వ్యాధులు రాకుండా ఉంటాయి.
2. బార్లీ గింజల నీళ్లను తాగితే లివర్, కిడ్నీలు శుభ్రంగా మారుతాయి. కిడ్నీల్లో ఉంటే స్టోన్స్ కరిగిపోతాయి. మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఉన్నవారికి ఈ నీళ్లు ఎంతగానో పనిచేస్తాయి. కిడ్నీ స్టోన్స్‌ను కరిగించుకోవచ్చు.
3. బార్లీ నీళ్లను తాగడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా శుభ్రంగా మారుతుంది. మలబద్దకం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.
4. అధిక బరువు, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు బార్లీ గింజల నీళ్లను రోజూ తాగితే ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. దీంతో గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
5. పలు రకాల క్యాన్సర్‌లు రాకుండా చూసే శక్తి బార్లీ గింజలకు ఉంటుంది. అందువల్ల వీటి నీటిని రోజూ తాగాలి. ఈ సీజన్‌లో ఈ నీళ్లను తాగడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. వేసవి తాపం నుంచి బయట పడవచ్చు. ఎండదెబ్బ తగలకుండా ఉంటుంది.