Mughlai Shahi Chicken Korama : మొఘలాయి షాహీ చికెన్ కుర్మా.. చికెన్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఇది కూడా ఒకటి. ఈ షాహీ చికెన్ కుర్మా చాలా రుచిగా ఉంటుంది. నాన్, రోటీ, చపాతీ, పూరీ వంటి వాటితో తినడానికి చాలా చక్కగా ఉంటుంది. ఈ చికెన్ కర్రీ మనకు ఎక్కువగా రెస్టారెంట్ లలో లభిస్తుంది. దీనిని మనం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. తరుచూ చేసే చికెన్ కర్రీల కంటే ఈ విధంగా తయారు చేసిన చికెన్ కర్రీ మరింత రుచిగా ఉంటుంది. ఎంతో రుచిగా, టేస్టీగా ఉండే ఈ మొఘలాయి షాహీ చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మొఘలాయి షాహీ చికెన్ కుర్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ – అరకిలో, ఉప్పు – ఒక టీ స్పూన్, కారం – ఒకటిన్నర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పెరుగు – 2 టీ స్పూన్స్, పసుపు – అర టీ స్పూన్, ఫ్రైడ్ ఆనియన్స్ – అర కప్పు, నానబెట్టిన జీడిపప్పు – 10, నానబెట్టిన బాదంపప్పు – 10, బిర్యానీ ఆకు – 1, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, యాలకులు – 5, లవంగాలు – 3, మిరియాలు – 6,జాప్రతి – కొద్దిగా, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, నీళ్లు – ముప్పావు గ్లాస్, గరం మసాలా – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్.
మొఘలాయి షాహీ చికెన్ కుర్మా తయారీ విధానం..
ముందుగా చికెన్ లో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, పసుపు వేసి బాగా కలపాలి. తరువాత చికెన్ పై మూత పెట్టి ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత జార్ లో ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు, పొట్టు తీసేసిన బాదంపప్పు వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. తరువాత మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత చికెన్ వేసి కలపాలి. దీనిని 3 నిమిషాల పాటు వేయించిన తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్, మరో 100 గ్రాముల పెరుగు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. తరువాత ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. దీనిపై మూత పెట్టి చికెన్ మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. చికెన్ మెత్తగా ఉడికి నూనె పైకి తేలిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మొఘలాయి షాహీ చికెన్ కుర్మా తయారవుతుంది. ఈ విధంగా తయారు చేసిన చికెన్ కుర్మాను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.