Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Nimmakaya Pappu : నిమ్మ‌కాయ ప‌ప్పును ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేసి తినండి.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..

D by D
January 21, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Nimmakaya Pappu : మ‌నం నిమ్మ‌కాయ‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. నిమ్మ‌ర‌సం మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. నిమ్మ‌ర‌సాన్ని వంట‌ల్లో మ‌నం విరివిర‌గా ఉప‌యోగిస్తూ ఉంటాం. ఈ నిమ్మ‌ర‌సాన్ని ఇత‌ర వంట‌కాల్లో వాడ‌డంతో పాటు దీనితో ఎంతో రుచిగా ఉండే ప‌ప్పును కూడా త‌యారు చేసుకోవ‌చ్చ‌న్న సంగ‌తి మ‌న‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు. నిమ్మ‌ర‌సం వేసి చేసే ఈ ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో అంద‌రూ ఈ ప‌ప్పును ఇష్టంగా తింటారు. నిమ్మ‌కాయ‌ల‌తో రుచిగా, సుల‌భంగా ప‌ప్పును ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

నిమ్మ‌కాయ ప‌ప్పు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కందిప‌ప్పు – 100 గ్రా., త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, క‌చ్చా ప‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 4, తాళింపు దినుసులు – 4, ఎండుమిర్చి – 2, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – అర టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, నిమ్మ‌కాయ‌లు – 2.

Nimmakaya Pappu recipe in telugu make in this method easy one
Nimmakaya Pappu

నిమ్మ‌కాయ ప‌ప్పు త‌యారీ విధానం..

ముందుగా కుక్క‌ర్ లో ప‌ప్పును తీసుకుని శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత అర గ్లాస్ నీళ్లు, ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి మూత పెట్టాలి. త‌రువాత ఈ ప‌ప్పును మూడు విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించుకోవాలి. త‌రువాత మూత తీసి ప‌ప్పును మెత్త‌గా చేసుకోవాలి. దీనిలో ఉప్పు, ప‌సుపు, అర గ్లాస్ నీళ్లు పోసి క‌ల‌పాలి. దీనిని మ‌రో 5 నిమిషాల పాటు ఉడికించి ప‌క్క‌కు పెట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు, వెల్లుల్లి రెబ్బ‌లు, ఎండుమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. తాళింపు వేగిన త‌రువాత దీనిని ముందుగా త‌యారు చేసుకున్న ప‌ప్పులో వేసి క‌ల‌పాలి. ప‌ప్పు పూర్తిగా చ‌ల్లారిన త‌రువాత అందులో నిమ్మ‌ర‌సం వేసి క‌ల‌పాలి.

ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే నిమ్మ‌కాయ ప‌ప్పు త‌యారవుతుంది. దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసే ప‌ప్పు కూర‌ల‌తో పాటు ఈ విధంగా నిమ్మ‌కాయ‌ల‌తో కూడా ప‌ప్పును త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. నోటికి రుచిగా ఏదైనా తినాల‌నిపించిన‌ప్పుడు, ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు ఈ విధంగా నిమ్మ‌కాయ ప‌ప్పు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ ప‌ప్పును లొట్ట‌లేసుకుంటూ అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Nimmakaya Pappu
Previous Post

Palakura Pulusu : పాల‌కూర‌ను ఎప్పుడైనా ఇలా వండారా.. ఒక్క‌సారి చేసి తినండి.. ఎంతో బాగుంటుంది..

Next Post

Khoya Jalebi : జిలేబీని ఈ విధంగా చేసి ఎప్పుడైనా తిన్నారా.. ఎంతో టేస్టీగా ఉంటుంది..

Related Posts

పోష‌ణ‌

ఈ విత్త‌నాలు ఏంటో తెలుసా..? వీటిని ప‌డేయ‌కుండా కచ్చితంగా తినాల్సిందే..!

June 14, 2025
హెల్త్ టిప్స్

బొప్పాయిని ఉద‌యం తింటే ఏం జ‌రుగుతుందంటే..?

June 14, 2025
హెల్త్ టిప్స్

స‌న్న‌గా ఉన్న‌వారు బ‌రువు పెర‌గాలి అనుకుంటున్నారా.. అయితే వీటిని తినండి..!

June 14, 2025
ఆధ్యాత్మికం

ప‌ర‌మేశ్వ‌రుడు పులి చ‌ర్మాన్ని ఎందుకు ధ‌రిస్తాడు.. దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

June 14, 2025
ఆధ్యాత్మికం

ల‌వంగాలు, క‌ర్పూరంతో ఇలా చేస్తే మీకుండే స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

June 14, 2025
vastu

వాస్తు ప్ర‌కారం ఇంట్లో రామ చిలుక‌ల‌ను పెంచుకోవ‌చ్చా..? పెంచితే ఏమ‌వుతుంది..?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!