Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Pachimirchi Kothimeera Karam : ప‌చ్చి మిర్చి కొత్తిమీర కారం ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

D by D
December 6, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Pachimirchi Kothimeera Karam : మ‌నం ప‌చ్చిమిర్చితో వివిధ ర‌కాల ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ప‌చ్చిమిర్చి వేసి చేసే ప‌చ్చ‌ళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా సుల‌భంగా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. ఇలా ప‌చ్చిమిర్చితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ప‌చ్చిమిర్చి కొత్తిమీర కారం కూడా ఒక‌టి. అల్పాహారాలతో, అన్నంతో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. చాలా సుల‌భంగా ఈ కారాన్ని మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. వంట చేయడానికి స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఇంట్లో కూర‌గాయ‌లు ఏం లేన‌ప్పుడు ఇలా ప‌చ్చిమిర్చి కొత్తిమీర కారాన్ని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ప‌చ్చిమిర్చి కొత్తిమీర కారాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌చ్చిమిర్చి కొత్తిమీర కారం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌చ్చిమిర్చి – 20, కొత్తిమీర – ఒక చిన్న క‌ట్ట‌, నూనె – ఒక టేబుల్ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బ‌లు – 10, చింత‌పండు – ఉసిరికాయంత‌, ప‌సుపు – చిటికెడు, ఉప్పు – త‌గినంత‌.

Pachimirchi Kothimeera Karam recipe in telugu make in this method
Pachimirchi Kothimeera Karam

తాళింపుకు కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ, ఇంగువ – కొద్దిగా.

ప‌చ్చిమిర్చి కొత్తిమీర కారం త‌యారీ విధానం..

ముందుగా ప‌చ్చిమిర్చిని ముక్క‌లుగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత మెంతులు, ఆవాలు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత వెల్లుల్లి రెబ్బ‌లు, చింత‌పండు, కొత్తిమీర వేసి వేయించాలి. ఇవ‌న్నీ వేగిన త‌రువాత ప‌సుపు వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవ‌న్నీ చ‌ల్లారిన త‌రువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. త‌రువాత ఉప్పు వేసి మిక్సీ ప‌ట్టుకోవాలి. దీనిని మ‌రీ మెత్త‌గా కాకుండా కొద్దిగా బ‌ర‌క‌గా ఉండేలా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి.

తరువాత తాళింపుకు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత తాళింపు దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఎండుమిర్చి, క‌రివేపాకు, ఇంగువ వేసి వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ తాళింపును ముందుగా త‌యారు చేసుకున్న కారంలో వేసి క‌ల‌పాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే ప‌చ్చిమిర్చి కొత్తిమీర కారం త‌యార‌వుతుంది. దీనిని వేడివేడి అన్నం, నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన ప‌చ్చిమిర్చి కొత్తిమీర‌ కారాన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Pachimirchi Kothimeera Karam
Previous Post

Instant Soft Idli : ఇడ్లీ పిండి అవ‌స‌రం లేకుండానే ఇలా సుతి మెత్త‌ని ఇడ్లీల‌ను చేయండి.. ఎంతో బాగుంటాయి..!

Next Post

How To Clean Copper Water Bottle : మీరు వాడుతున్న రాగి బాటిల్స్‌ను ఇలా సుల‌భంగా క్లీన్ చేయండి.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

Related Posts

పోష‌ణ‌

టిలాపియా ఫిష్ తింటే కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు..!

July 3, 2025
వినోదం

బాలకృష్ణ చిన్న కూతురు తేజ‌స్విని ఎక్కడ ఉంటుంది.. ఏం చేస్తుందో తెలుసా..?

July 3, 2025
వినోదం

మహేష్ బాబు పక్కన ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే !

July 3, 2025
ఆధ్యాత్మికం

మ‌హిళ‌లు అస‌లు ఎందుకు గాజుల‌ను ధ‌రించాలి..?

July 3, 2025
హెల్త్ టిప్స్

మ‌హిళ‌లు గ‌ర్భం ధ‌రించిన‌ప్పుడు ఈ 20 ఆహారాల‌కు దూరంగా ఉండాలి..!

July 3, 2025
ఆధ్యాత్మికం

వినాయ‌కుడి క‌థ నుంచి త‌ల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యాలు ఇవే..!

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.