Paneer Pakoda : పకోడీలు అంటే సహజంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. చాలా మంది పకోడీలు అంటే ఎగిరి గంతేస్తారు. చల్లని వాతావరణంలో వీటిని తింటుంటే వచ్చే మజాయే వేరుగా ఉంటుంది. ఇక మనకు పకోడీలు బయట స్వీట్ షాపుల్లో లభిస్తుంటాయి. చిరు వ్యాపారులు కూడా పకోడీలను విక్రయిస్తుంటారు. ఈ క్రమంలోనే పకోడీలు మనకు వివిధ రకాల వెరైటీల్లో లభిస్తుంటాయి. ఇక పకోడీలను మనం ఇంట్లోనూ తయారు చేసుకోవచ్చు. తయారు చేయడం కూడా సులభమే. అలాగే పకోడీల్లో పనీర్ పకోడీలు కూడా ఉంటాయి. వీటిని కూడా చాలా మంది ఇష్టంగానే తింటారు. వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పనీర్ పకోడీల తయారీకి కావల్సిన పదార్థాలు..
పనీర్ ముక్కలు – పావు కిలో, శనగపిండి – 1 కప్పు, ఉప్పు – తగినంత, నీళ్లు – అర కప్పు, పచ్చి మిర్చి – 2, కారం – అర టీస్పూన్, నూనె – తగినంత.
పనీర్ పకోడీలను తయారు చేసే విధానం..
శనగపిండి, పచ్చి మిర్చి, కారం, ఉప్పులకు కొద్దిగా నీరు చేర్చి మిక్సీలో మెత్తగా పట్టుకోవాలి. మిశ్రమాన్ని బయటకు తీసి అర కప్పు నీళ్లు పోసి బాగా కలిపి అరగంటపాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. పనీర్‌ను కాస్త పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయాలి. ఈ ముక్కలను బ్లెండ్ చేసి పెట్టుకున్న పిండి మిశ్రమంలో ముంచి నూనెలో డీప్ ఫ్రై చేయాలి. వీటిని టమాటా సాస్‌తో కానీ.. పుదీనా చట్నీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటాయి. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. రెగ్యులర్‌గా చేసే పకోడీలకు బదులుగా ఒక్కసారి ఇలా పనీర్‌తో పకోడీలను చేసి చూడండి. ఎంతో రుచిగా ఉంటాయి. అందరికీ నచ్చుతాయి.