Ravi Akula Paste : చెట్లను పూజించే సంస్కృతిని మనం భారత దేశంలో మాత్రమే చూడవచ్చు. మనం పూజించే చెట్లల్లో రావి చెట్టు కూడా ఒకటి. ఇది తెలియని వారుండరనే చెప్పవచ్చు. ప్రతి దేవాలయంలో, ప్రతి గ్రామంలో ఈ రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టుకు ఎంతో కాలంగా పూజలు చేస్తూ ఉన్నారు. ఆధ్యాత్మికంగానే కాకుండా ఔషధంగా కూడా ఈ రావి చెట్టు మనకు ఉపయోగపడుతుంది. రావి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అలాగే ప్రతి భాగం కూడా మనకు ఎంతో ఉపయోగపడుతుంది. రావి చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. రావి చెట్టును ఉపయోగించడం వల్ల మనకు వచ్చే అన్ని రకాల వ్యాధులను నయం చేసుకోవచ్చు. పాము కాటు, ఆస్తమా, విరేచనాలు, మలబద్దకం, చర్మ వ్యాధులు, మూత్రపిండాల వ్యాధులతో పాటు ఇతర అనేక రకాల అనారోగ్య సమస్యలకు కూడా దీనిని ఔషధంగా ఉపయోగించవచ్చు.
రావి చెట్టు మనకు ఔషధంగా ఉపయోగపడుతుందని, దీనిని వాడడం వల్ల జబ్బులను నయం చేసుకోవచ్చని శాస్త్రీయంగా కూడా నిరూపితమైనది. రావి చెట్టు బెరడులో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. రావి చెట్టు ఆకుల్లో గ్లూకోజ్, అస్టరియోడ్, మెన్నోస్, ఫినాలిక్ అధికంగా ఉంటాయి. పురాతన కాలం నుండి దీనిని ఔషధంగా ఉపయోగిస్తున్నారు. రావి ఆకులను ఉపయోగించి మనం కడుపు నొప్పిని తగ్గిచుకోవచ్చు. కడుపులో మెలి పెట్టి తిప్పినట్టు ఉండడంతో పాటు విపరీతమైన నొప్పి కలుగుతుంది. కడుపు నొప్పి ఇబ్బంది పెడుతున్నప్పుడు చాలా మంది కడుపు నొప్పికి సంబంధించిన మందులను వాడుతూ ఉంటారు. మందులపై మనం ఎక్కువ కాలం పాటు ఆధారపడలేము. అలాంటప్పుడు రావి ఆకులను ఉపయోగించి మనం చాలా సులభంగా కడుపు నొప్పిని తగ్గించుకోవచ్చు. రావి ఆకులతో కడుపు నొప్పి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. దీనిని ఎలా వాడాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా 6 లేదా 7 రావి ఆకులను తీసుకుని శుభ్రం చేసుకోవాలి.
తరువాత వాటిని ముక్కలుగా చేసి ఒక జార్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో 2 టీ స్పూన్ల బెల్లం వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను శనగ గింజలంత మాత్రలుగా చేసుకుని గాలికి ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి. ఈ మాత్రలను మంచి నీటితో కలిపి తీసుకోవడం వల్ల కడుపు నొప్పి తగ్గుతుంది. ఈ చిట్కాను పాటించడం వల్ల కడుపు నొప్పి తగ్గడంతో పాటు పొట్టలో పేరుకుపోయిన మలినాలు, వ్యర్థాలు తొలగిపోయి పొట్ట కూడా శుభ్రపడుతుంది. కడుపు నొప్పితో బాధపడే వారు ఈ చిట్కాను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చని రావి చెట్టు మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.