ఇది వరకు మనం గుమ్మడికాయ హల్వా, క్యారెట్ హల్వా తయారు చేసుకొని తినే ఉంటాం. అయితే కొత్తగా ఏమైనా తినాలని భావించే వారు తప్పకుండా ఈ బంగాళా దుంప హల్వా ప్రయత్నించాల్సిందే.మరి ఎంతో రుచి కరమైన ఈ బంగాళదుంప హల్వా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
బంగాళదుంపలు 5, మైదా ఒక కప్పు, పాలు ఒక కప్పు, నెయ్యి అరకప్పు, పంచదార పొడి ఒకటిన్నర కప్పు, యాలకల పొడి టీ స్పూన్, బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ కొద్దిగా, ఫుడ్ కలర్.
తయారీ విధానం
ముందుగా బంగాళదుంపలను బాగా శుభ్రం చేసి వాటిపై ఉన్న తొక్క తొలగించాలి. తరువాత బంగాళదుంపలను చిన్నగా తరిగిపెట్టుకోవాలి. తరువాత స్టవ్పై ఒక కడాయి ఉంచి కొద్దిగా నెయ్యి వేయాలి .తర్వాత చిన్నమంటపై ఈ బంగాళాదుంపల తురుమును వేసి బాగా వేయించాలి. బంగాళాదుంపల తురుము మాడకుండా ఎంత వేగితే అంత రుచికరంగా ఉంటుంది. ఈ బంగాళా తురుము బాగా వేగిన తరువాత ఇందులోకి పాలు, పంచదార పొడి, ఫుడ్ కలర్ (అవసరమైతేనే వేసుకోవాలి లేకపోతే లేదు) వేసి కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని బాగా ఉడికితే మెత్తటి ముద్దలాగా తయారవుతుంది. ఈ మిశ్రమంలోకి బాదం, జీడిపప్పు, ఏలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.ఈ మిశ్రమం చల్లారిన తరవాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచి కరమైన బంగాళాదుంపల హల్వా ఆస్వాదించవచ్చు.