Kangdi Kabab : మనకు రెస్టారెంట్ లలో లభించే చికెన్ వెరైటీలలో తంగ్డి కబాబ్ కూడా ఒకటి. ఈ కబాబ్స్ చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. వీటిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. అయితే చాలా మంది వీటిని మనం ఇంట్లో తయారు చేసుకోలేము అని భావిస్తూ ఉంటారు. కానీ ఈ తంగ్డి కబాబ్స్ ను మనం చాలా సులభంగా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే ఒవెన్, తందూరీ లేకపోయినా కూడా వీటిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఒవెన్, తందూర్ లేకుండా ఇంట్లోనే తంగ్డి కబాబ్స్ ను రెస్టారెంట్ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తంగ్డి కబాబ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పెరుగు – ఒక కప్పు, చికెన్ లెగ్ పీసెస్ – 6, ఉప్పు – తగినంత, కాశ్మీరీ కారం – 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్స్, కచ్చా పచ్చాగా దంచిన పచ్చిమిర్చి – 7, నిమ్మకాయ – 1, ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, చాట్ మసాలా – ఒక టీ స్పూన్, బ్లాక్ సాల్ట్ – పావు టీస్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్, యాలకుల పొడి – రెండు చిటికెలు, పసుపు – పావు టీ స్పూన్, కసూరి మెంతి – ఒక టీ స్పూన్, చికెన్ తందూరి మసాలా – 2 టేబుల్ స్పూన్స్, ఆవాల నూనె – 2 టేబుల్ స్పూన్స్, వంటసోడా – చిటికెడు, ఫుడ్ కలర్ – కొద్దిగా.

తంగ్డి కబాబ్ తయారీ విధానం..
ముందుగా పెరుగును వస్త్రంలో వేసి నీరంతా పోయేలా గట్టిగా పిండాలి. తరువాత ఈ పెరుగును ఒక గిన్నెలోకి తీసుకుని అందులో లెగ్ పీసెస్ తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి. తరువాత లెగ్ పీసెస్ కు గాట్లు పెట్టి తీసుకుని ఈ మసాలా బాగా పట్టించాలి. తరువాత ఈ లెగ్ పీసెస్ ను రాత్రంతా ఫ్రిజ్ లో ఉంచి మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న తరువాత వీటిని బయటకు తీసి ఒక గంట పాటు పక్కకు ఉంచాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే కళాయిలో ముందుగా ఒక టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసి వేడి చేయాలి. తరువాత లెగ్ పీసెస్ ను ఉంచి వేయించాలి. ఇలా పది నిమిషాల పాటు వేయించిన తరువాత వీటిని మరో వైపుకు తిప్పి మరో 10 నిమిషాల పాటు వేయించాలి.
తరువాత మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు వేయించాలి. ఇలా వేయించిన తరువాత ముక్కల మధ్యలో ఒక చిన్న గిన్నెను ఉంచాలి. తరువాత ఇందులో బొగ్గును కాల్చి వేసుకోవాలి. ఈ బొగ్గుపై ఒక టీ స్పూన్ బటర్ వేసి పొగా రాగానే మూత పెట్టాలి. ఇలా 5 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచి స్మోకి ప్లేవర్ వస్తుంది. తరువాత స్టవ్ మీద గ్రిల్ ను ఉంచి మంటను మధ్యస్థంగా ఉంచాలి. ఇప్పుడు ఈ లెగ్ పీసెస్ ను మంటపై అటూ ఇటూ తిప్పుడూ అర నిమిషం పాటు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే తంగ్డి కబాబ్ తయారవుతుంది. వీకెండ్స్ లో, స్సెషల్ డేస్ లో ఇలా ఇంట్లోనే కబాబ్ ను తయారు చేసుకుని తినవచ్చు. ఈ కబాబ్ ను గ్రీన్ చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది.