Saggubiyyam Idli : ఇడ్లీ ర‌వ్వ‌, స‌గ్గు బియ్యం క‌లిపి మెత్త‌ని ఇడ్లీల‌ను ఇలా చేసుకోండి.. ఒక్క‌టి కూడా విడిచిపెట్ట‌కుండా మొత్తం తింటారు..!

Saggubiyyam Idli : స‌గ్గుబియ్యం ఇడ్లీ.. స‌గ్గుబియ్యంతో చేసే ఈ ఇడ్లీలు చాలా రుచిగా, మెత్త‌గా ఉంటాయి. అల్పాహారం త‌యారు చేసుకోవ‌డానికి స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఈ ఇడ్లీల‌ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. వెరైటీగా తినాల‌నిపించిన‌ప్పుడు, ఏ టిఫిన్ చేయాలో తోచ‌న‌ప్పుడు ఇలా స‌గ్గుబియ్యంతో ఇడ్లీల‌ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. అప్ప‌టిక‌ప్పుడు స‌గ్గుబియ్యంతో రుచిక‌ర‌మైన ఇడ్లీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

స‌గ్గుబియ్యం ఇడ్లీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఇడ్లీ ర‌వ్వ – ఒక క‌ప్పు, స‌గ్గుబియ్యం – అర క‌ప్పు, పుల్ల‌టి మ‌జ్జిగ – రెండు క‌ప్పులు, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, శ‌న‌గ‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, మిన‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, త‌రిగిన క‌రివేపాకు – ఒక రెమ్మ‌, చిల్లీ ప్లేక్స్ – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, వంట‌సోడా – పావు టీ స్పూన్.

Saggubiyyam Idli recipe in telugu very tasty and healthy breakfast
Saggubiyyam Idli

స‌గ్గుబియ్యం ఇడ్లీ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో ఇడ్లీ ర‌వ్వ‌ను తీసుకోవాలి. త‌రువాత స‌గ్గుబియ్యం వేసి క‌ల‌పాలి.త‌రువాత మ‌జ్జిగ పోసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి గంట పాటు నాన‌బెట్టాలి. త‌రువాత మరికొన్ని మ‌జ్జిగ‌ను పోసి ఇడ్లీ పిండిలా క‌లుపుకోవాలి. త‌రువాత క‌ళాయిలోనెయ్యి వేసి వేడి చేయాలి. త‌రువాత మిన‌ప‌ప్పు, శ‌న‌గ‌ప‌ప్పు, ఆవాలు వేసి వేయించాలి. త‌రువాత క‌రివేపాకు వేసి వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ తాళింపును ఇడ్లీ పిండిలో వేసి క‌ల‌పాలి. త‌రువాత ఉప్పు, చిల్లీ ప్లేక్స్, వంట‌సోడా వేసి క‌ల‌పాలి. త‌రువాత ఇడ్లీ ప్లేట్ ల‌ను తీసుకుని వాటికి నూనెను రాసుకోవాలి. త‌రువాత పిండిని వేసుకుని ఇడ్లీ కుక్క‌ర్ లో ఉంచి మూత పెట్టాలి. వీటిని 10 నిమిషాల పాటు మ‌ధ్య‌స్థ మంట‌పై 5 నిమిషాల పాటు చిన్న మంట‌పై ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత వీటిని బ‌య‌ట‌కు తీసి కొద్దిగా చ‌ల్లారిన త‌రువాత ప్లేట్ లో వేసుకుని చ‌ట్నీతో స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే స‌గ్గుబియ్యం ఇడ్లీలు త‌యార‌వుతాయి. ఇలా స‌గ్గుబియ్యంతో రుచిక‌ర‌మైన ఇడ్లీల‌ను అప్ప‌టిక‌ప్పుడు త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts