Shruti Haasan : కొందరు హీరోయిన్లకు సినిమాలు ఎంత హిట్ అయినా అవకాశాలు సరిగ్గా రావు. అలాంటి హీరోయిన్లు ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. అయితే కొందరు హీరోయిన్లకు మాత్రం బొటాబొటిన విజయాలు ఉన్నా.. వారికి అవకాశాలకు మాత్రం కొదువ ఉండదు. అవును.. శృతి హాసన్ కూడా సరిగ్గా ఇలాంటి కోవకే చెందుతుందని చెప్పవచ్చు. ఆమెకు గత ఏడాది కాలంలో అంతగా చెప్పుకోదగిన హిట్స్ లేదు. కానీ ఈమెకు వరుస చిత్రాల్లో ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఈమె ముగ్గురు టాప్ తెలుగు హీరోల సినిమాల్లో నటించే చాన్స్‌ను కొట్టేసింది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ అనే సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ మధ్యనే ఆమె బాలకృష్ణ 107వ సినిమాకు కూడా హీరోయిన్‌గా ఎంపికైంది. బాలకృష్ణ సినిమా అనగానే శృతి హాసన్ ముందుగా నో చెప్పిందట. కానీ దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఉన్న చొరవ కారణంగా ఆమెకు ఆయన సర్ది చెప్పడంతో.. తరువాత ఆమె బాలయ్య సినిమాలో నటించేందుకు అంగీకరించింది.
ఇక ఇప్పుడు ముచ్చటగా ఆమె మూడో అగ్ర హీరో సినిమాకు ఎంపికైంది. మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమాలో ఆయన పక్కన శృతి సందడి చేయనుంది. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. ఇక ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. బాబీ దర్శకత్వం వహించనున్నారు.
ఏది ఏమైనా శృతి హాసన్ పరిస్థితి ఇప్పుడు తంతే.. బూరెల బుట్టలో పడినట్లు అయిందని చెప్పవచ్చు. ఈమెకు గతేడాది కాలంలో చెప్పుకోదగిన సినిమాలు అయితే లేవు. కానీ ముగ్గురు అగ్రహీరోల సినిమాల్లో చాన్స్ వచ్చిందంటే అది ఈమె లక్ అనే చెప్పుకోవాలి. దీంతో ఈమెకు అదృష్టం మామూలుగా పట్టలేదని అంటున్నారు. ఈ మూడు సినిమాల్లో ఏ ఒక్కటి హిట్ అయినా చాలు.. ఈమెకు మళ్లీ మంచి బ్రేక్ వస్తుంది. దీంతో మళ్లీ ఆఫర్లు క్యూ కడతాయి. ఒకవేళ మూడింటికి మూడు సినిమాలు హిట్ అయితే.. అప్పుడు శృతి హాసన్ రేంజ్ ఇంకా పెరుగుతుందని కచ్చితంగా చెప్పవచ్చు. మరి ఈమె హిట్ కొట్టి గోల్డెన్ లెగ్ అనిపించుకుంటుందో.. లేదా ఐరన్ లెగ్ అన్న ముద్ర పడుతుందో.. వేచి చూస్తే తెలుస్తుంది.