భారతీయ సంప్రదాయాల ప్రకారం ఎన్నో వృక్షాలను దైవ సమానంగా భావిస్తారు. ఈ క్రమంలోనే ఆ దేవతా వృక్షాలకు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించడం చేస్తుంటాము. ఈ విధంగా చేయడం వల్ల సకల సంపదలు చేకూరుతాయని భావిస్తారు. ఇందులో భాగంగానే రావి చెట్టును హిందువులు సాక్షాత్తూ విష్ణు స్వరూపం అని భావిస్తారు. ఈ రావిచెట్టునే అశ్వత్థ వృక్షం, బోధివృక్షం అని కూడా పిలుస్తారు.
విష్ణు స్వరూపంగా పిలువబడే ఈ రావిచెట్టు మొదట్లో విష్ణువు బోదలో, కేశవుడు శాఖలో, నారాయణుడు పత్రాలలో, హరి ఫలాల్లో, సర్వ దేవ సాహితుడైన అచ్యుతుడు నివసిస్తారనీ చెబుతారు. అదేవిధంగా సిద్ధార్థుడికి జ్ఞానోదయం అయింది కూడా ఈ వృక్షం కిందే కనుక దీనిని బోధి వృక్షం అని కూడా పిలుస్తారు.
కుటుంబంలో కలహాలు ఉన్న దంపతులు లేదా సంతానం లేని వారు రావిచెట్టు, వేపచెట్టును పూజించడం వల్ల వారి దాంపత్య జీవితం సుఖంగా ఉండటమే కాకుండా, సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. ప్రతి రోజూ రావి చెట్టుకు ఒక చెంబుడు నీళ్లు పోసి రావి చెట్టు నీడలో నిలబడితే వారికి శని దోషాలు ఉండవని పండితులు చెబుతున్నారు.