Street Style Masala Sweet Corn : మనం స్వీట్ కార్న్ తో రకరకాల చిరుతిళ్లను తయారు చేసుకుని తింటూ ఉంటాము. స్వీట్ కార్న్ తో చేసే చిరుతిళ్లు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. స్వీట్ కార్న్ తో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో మసాలా స్వీట్ కార్న్ కూడా ఒకటి. మసాలా స్వీట్ కార్న్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. పిల్లలు, పెద్దలు ఈ మసాలా స్వీట్ కార్న్ ను ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. ఎంతో రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఈ మసాలా స్వీట్ కార్న్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా స్వీట్ కార్న్ తయారీకి కావల్సిన పదార్థాలు..
స్వీట్ కార్న్ గింజలు – 2 కప్పులు, నూనె – అర టేబుల్ స్పూన్, కచ్చా పచ్చాగా దంచిన ఉల్లిపాయ పేస్ట్ – 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ -పావు టీ స్పూన్, పసుపు – చిటికెడు, కారం – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – పావు టీ స్పూన్, చాట్ మసాలా – పావు టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా స్వీట్ కార్న్ తయారీ విధానం..
ముందుగా స్వీట్ కార్న్ ను నీటిలో వేసి 15 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత వీటిని వడకట్టి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కలపాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత స్వీట్ కార్న్ వేసి కలపాలి. వీటిని మరో 3 నిమిషాల పాటు వేయించిన తరువాత చాట్ మసాలా, కొత్తిమీర చల్లుకోవాలి. వీటిని మరో నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మసాలా స్వీట్ కార్న్ తయారవుతుంది. స్నాక్స్ గా తింటే ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఇలా చేసిన మసాలా స్వీట్ కార్న్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.