Tabu : బాలీవుడ్ నటి టబు ఒకప్పుడు తెలుగు తెరపై ఒక వెలుగు వెలిగింది. అప్పట్లో ఆమె దాదాపుగా అనేక మంది స్టార్ హీరోలతో కలిసి నటించింది. ఆమె నటించిన అనేక చిత్రాలు హిట్ అయ్యాయి. తరువాత ఆమె బాలీవుడ్‌కు పరిచయం అయింది. ఇటీవలి కాలంలో ఆమె తెలుగులోనూ కొన్ని చిత్రాల్లో నటించింది. కానీ పెద్దగా విజయం సాధించలేదు. అయితే అప్పట్లో టబుకు, నాగార్జునకు మధ్య ఏదో ఉందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే వారు రిలేషన్షిప్లో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకుంటారని పుకార్లు వచ్చాయి. వీటిపై టబు ఎప్పటికప్పుడు స్పందిస్తోంది. అయతే మరోసారి ఈ వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ఆమె మళ్లీ వివరణ ఇచ్చుకుంది.
తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టబు మాట్లాడుతూ.. తాను నాగార్జున మంచి ఫ్రెండ్స్ అని.. తమ మధ్య ఏదీ లేదని స్పష్టత ఇచ్చింది. అప్పట్లో తాను హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిన విషయం కరెక్టేనని.. కానీ అది నాగార్జున కోసం కాదని.. తాను హైదరాబాద్‌లో ఓ ఇంటిని కొన్నానని.. అందుకనే ఇక్కడికి మారాల్సి వచ్చిందని తెలిపింది.
ఇక కొందరు ఫ్రెండ్ షిప్ అంటే ఏవో గూడార్థాలు తీస్తారని.. కానీ ఫ్రెండ్ షిప్ అంటే అర్థం వేరే అని చెప్పింది. ఒక ఆడ, మగ చనువుగా ఉంటే.. ఏవో అర్థాలు తీయడం, వారికి ఏదో అంటగట్టడం సబబు కాదని.. నాగార్జున, తాను చనువుగా ఉండే మాట నిజమే అయినా.. తాము మంచి స్నేహితులమని.. అంతకు మించి తమ మధ్య ఏమీ లేదని తెలియజేసింది.
కాగా టబు అప్పట్లో ఆవిడా మా ఆవిడే, నిన్నే పెళ్లాడతా, సిసింద్రీ.. వంటి చిత్రాల్లో నాగార్జునతో కలిసి నటించింది. వీరు అప్పట్లో పలు ఫంక్షన్లకు కలసి వెళ్లారు. దీంతో వీరి మధ్య ఏదో ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి.