Tamannah : స్టార్ హీరోయిన్స్ అందరూ ఈమధ్య కాలంలో మాల్దీవ్స్‌లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ బికినీలు ధరించి ఫొటోలకు పోజులు ఇస్తూ గ్లామర్ షోలతో రెచ్చగొడుతున్నారు. ఈ క్రమంలోనే మిల్కీ బ్యూటీ తమన్నా మాల్దీవ్స్‌లో తాజాగా సందడి చేసింది. పింక్ కలర్ బికినీ ధరించి అక్కడ విహరిస్తూ.. ఆ ఫొటోలను షేర్ చేసింది. దీంతో ఆ ఫొటోలు కుర్రకారు మతులను పోగొడుతున్నాయి.
తమన్నా ఈ మధ్య కాలంలో హీరోయిన్‌గా కన్నా సహాయ పాత్రల్లోనే ఎక్కువగా నటిస్తోంది. ఈమె ఓ చానల్‌లో నిర్వహించిన వంటల ప్రోగ్రామ్‌కు యాంకర్‌గా కూడా ఇటీవల కొనసాగింది. కానీ ఆ షోకు రేటింగ్స్ రావడం లేదని చెప్పి ఈమెను తీసేసి అనసూయను పెట్టుకున్నారు. అయితే అనసూయను పెట్టినా ఆ షోకు రేటింగ్స్ రాలేదు. దీంతో దాన్ని అర్థాంతరంగా ఆపేశారు.
ఇక ప్రస్తుతం తమన్నా మాల్దీవ్స్‌లో తన వెకేషన్‌ను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. బీచ్ వద్ద, సైకిల్ తొక్కుతూ తమన్నా విహరిస్తోంది. కాగా ఈమె సినిమా విషయానికి వస్తే.. ఇటీవలే నితిన్ నటించిన మ్యాస్ట్రో చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో ఈమె అలరించింది. ఇక భోళా శంకర్‌లో చిరంజీవి పక్కన హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ఈమె నటించిన ఎఫ్3 మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతోపాటు సత్యదేవ్‌తో కలిసి గుర్తుందా శీతాకాలం అనే సినిమాలో నటిస్తోంది.