Telangana : ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా డిసెంబర్ 31 వేడుకలకు అందరూ సిద్ధమవుతున్నారు. అయితే కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షలను విధించాయి. ముఖ్యంగా డిసెంబర్ 31, జనవరి 1 వేడుకలపై నిషేధం విధించాయి. ఇక తెలంగాణలోనూ జనవరి 2వ తేదీ వరకు ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. అయినప్పటికీ రాష్ట్రంలోని మందుబాబులకు మాత్రం సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలోని మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 31వ తేదీ రోజు అర్థరాత్రి వరకు వైన్స్ షాపులు ఓపెన్ చేసుకునేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈవెంట్లు, బార్లు, రెస్టారెంట్లకు కూడా డిసెంబర్ 31వ తేదీ రోజు అర్థరాత్రి వరకు ఓపెన్ చేసుకునేలా అనుమతులు ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ప్రకటిస్తూ.. ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో తెలంగాణలోని మద్యం ప్రియులు పండుగ చేసుకోనున్నారు.
అయితే డిసెంబర్ 31వ తేదీన అర్థరాత్రి వరకు మద్యం లభించినప్పటికీ ప్రభుత్వం మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్‌ను కఠినంగా అమలు చేస్తామని చెప్పింది. అంటే.. తాగి వాహనాలను నడపకూడదు. అయినప్పటికీ అర్థరాత్రి వరకు వైన్స్, బార్లు ఓపెన్ ఉండడం అంటే.. అది మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు.
ఇక ప్రభుత్వం ఇంతకు ముందే కరోనా ఆంక్షలను విధించిన విషయం విదితమే. తెలంగాణ రాష్ట్రంలో జనవరి 2 వరకు కరోనా ఆంక్షలను అమలు చేయనున్నారు. ఇక అటు ఏపీలోనూ డిసెంబర్ 31వ తేదీ అర్థరాత్రి వరకు మద్యం దుకాణాలను ఓపెన్ చేసి ఉంచవచ్చని అక్కడి ప్రభుత్వం కూడా అనుమతులు ఇచ్చింది. దీంతో మద్యం ప్రియులు పండుగ చేసుకుంటున్నారు.