OTT : కరోనా కారణంగా ఇప్పటికే అనేక సినిమాలను ఓటీటీల్లో రిలీజ్ చేశారు. పలువురు స్టార్ హీరోలతోపాటు చిన్న సినిమాలు కూడా అనేకం ఓటీటీల్లోనే రిలీజ్ అయ్యాయి. అయితే ఇప్పుడు కరోనా ప్రభావం అంతగా లేకపోయినా.. హీరోలు మాత్రం ఇంకా థియేటర్లలో సినిమాలను రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో చాలా వరకు హీరోల సినిమాలు ఇప్పటికీ ఇంకా ఓటీటీల్లోనే విడుదలవుతున్నాయి. ఇక మార్చి 11, 18 తేదీల్లో ముగ్గురు హీరోల సినిమాలు నేరుగా ఓటీటీల్లోనే విడుదల కానున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
తమిళ స్టార్ హీరో ధనుష్, మాళవిక మోహనన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం.. మారన్. ఈ సినిమా ఈ నెల 11వ తేదీన నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
ఇక మార్చి 18వ తేదీన దుల్కర్ సల్మాన్ నటించిన శాల్యూట్ అనే సినిమా విడుదల కానుంది. ఈ మూవీ కూడా నేరుగా ఓటీటీలోనే విడుదల కానుంది. సోనీ లివ్ ప్లాట్‌ఫామ్‌పై ఈ మూవీని స్ట్రీమ్ చేయనున్నారు.
అలాగే ఆది పినిశెట్టి లీడ్ రోల్‌లో నటించిన క్లాప్ అనే మూవీ కూడా ఓటీటీలోనే విడుదల కానుంది. మార్చి 11వ తేదీన ఈ సినిమాను సోనీ లివ్‌లో స్ట్రీమ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరోల సినిమాలు ఇంకా ఓటీటీల్లోనే విడుదలవుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.