Potato Peels : బంగాళాదుంపలను మనం ఎంతో కాలంగా ఆహారంగా తీసుకుంటూ ఉన్నాం. బంగాళాదుంపల్లో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయన్నా సంగతి మనందరికి తెలిసిందే. వీటితో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. మనం సాధారణంగా బంగాళాదుంపలపై ఉండే తొక్కను తీసేసిన తరువాత వాటిని వండుకుని తింటూ ఉంటాం. అయితే కేవలం బంగాళాదుంపల్లోనే కాకుండా బంగాళాదుంపలపై ఉండే తొక్కలో కడా ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. బంగాళాదుంప తొక్కలో ఉండే ఔషధ గుణాల గురించి తెలుసుకుంటే మనం ఆశ్చర్యపోవాల్సిందే. ఈ తొక్క కూడా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. బంగాళాదుంప తొక్కలో ఉండే ఔషధ గుణాల గురించి అలాగే అది మనకు ఏవిధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
బంగాళాదుంప తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ బారిన పడకుండా చేయడంలో సహాయపడతాయి. అలాగే వీటిలో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడంలో దోహదపడుతుంది. అలాగే శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరిచి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా బంగాళాదుంప తొక్కలు మనకు సహాయపడతాయి. అయితే ఈ బంగాలాదుంప తొక్కలను ఎలా తీసుకోవడం వల్ల మనం ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం ముందుగా బంగాళాదుంపలను తొక్కతో సహా బాగా కడగాలి. తరువాత బంగాళాదుంపల నుండి తొక్కను వేరు చేసి ముక్కలుగా తరగాలి. తరువాత ఈ ముక్కలను ఒక గ్లాస్ నీటిలో వేసి పది నిమిషాల పాటు బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి గోరు వెచ్చగా అయిన తరువాత తాగాలి. ఈ నీటిలో రుచి కొరకు ఒక టీ స్పూన్ తేనెను కూడా వేసుకుని తాగవచ్చు. ఇలా బంగాళాదుంప తొక్కలతో చేసిన నీటిని తాగడం వల్ల అధిక బరువు సమస్య నుండి కూడా బయటపడవచ్చు.
దీనిలో అధికంగా ఉండే ఫైబర్ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో ఉపయోగపడుతుంది. బంగాళాదుంప తొక్కలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా చేయడంలో సహాయపడతాయి. అలగే ఈ తొక్కలను పేస్ట్ గా చేసి గాయాలపై, పుండ్లపై కూడా లేపనంగా రాసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. అలాగే బంగాళాదుంప తొక్కల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కనుక వీటితో చేసిన నీటిని తాగడం వల్ల రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. అలాగే ఈ బంగాళాదుంప తొక్కలు మన అందాన్ని మెరుగుపరచడంలో కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ తొక్కలను మెత్తగా పేస్ట్ గా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
తరువాత ఈ పేస్ట్ లో ముల్తానీ మట్టి లేదా చందనం కలిపి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల చర్మం పై ఉండే మృతకణాలు తొలగిపోతాయి. అలాగే మొటిమలు, మచ్చలు, ముడతలు కూడా తగ్గి ముఖం నిగారింపును సొంతం చేసుకుంటుంది. ఈ విధంగా బంగాళాదుంప తొక్కలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయని వీటిని ఉపయోగించడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని అలాగే అందాన్ని కూడా సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.