సూరత్ కు చెందిన ఒక మహిళ తన ఇంటి ముందు నడుస్తుండగా ఒక వాటర్ ట్యాంక్ విరిగి తన పైన పడిపోయింది. అదృష్టవశాత్తు ప్రమాదం ఏమీ జరగలేదు. వాటర్ ట్యాంక్ ఓపెనింగ్ లో తన తల ఉండిపోయింది. అయితే ఈ సంఘటన తను ఆపిల్ తింటున్నప్పుడు చోటు చేసుకుంది. ఇలా జరిగిన తర్వాత అక్కడ ఉన్నవారు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. అప్పటికే తను వాటర్ ట్యాంక్ ను తీసి పక్కన పెట్టి ఆపిల్ తింటూ వెళ్లిపోయింది.
అయితే తన కుటుంబ సభ్యులు ఈమె ఎంతో అదృష్టవంతురాలు అందుకే ఏ ప్రమాదం జరగలేదు అని చెప్పారు. వాటర్ ట్యాంక్ విరిగిపోవడానికి సరైన ఆధారాలు లేవు కాకపోతే అక్కడ ఉన్న వారు చెప్పిన దాని ప్రకారం ఎక్కువ గాలి రావడంతో పడిపోయింది అని అంటున్నారు.
కానీ ఎవరికి హాని జరగలేదని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంత ప్రమాదం నుండి బయట పడిన తర్వాత కూడా ఆపిల్ తింటూ వెళ్లిపోవడంతో నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. ఆమె అదృష్టం బాగుండడం వలన వాటర్ ట్యాంక్ సరిగా ల్యాండ్ అయిందని పలువురు అంటున్నారు. మరికొందరు అయితే ఏం జరిగినా తినడం మాత్రం ఆపకూడదు అని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.