lifestyle

Toe : కాలి బొట‌న వేలి క‌న్నా ప‌క్క‌న ఉన్న వేలు పొడ‌వుగా ఉంటే.. ఏమ‌వుతుందో తెలుసా..?

Toe : చాలామంది అమ్మాయిలలో ఈ విషయం గమనించే ఉంటారు. అమ్మాయికి కాలి బొటన వేలు కంటే దాని పక్కన వేలు పొడవుగా ఉంటే గడుసుదని అంటూ ఉంటారు. అదేవిధంగా బొటనవేలు పొడవుగా ఉంటే ఎలా ఉంటారు..? అనే సందేహం చాలామందిలో తలెత్తే ఉంటుంది. పక్కన వేలు కంటే కాలి బొటన వేలు పొడవుగా ఉంటే ఆ అమ్మాయి గుణగణాలు ఎలా ఉంటాయి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

కాలి వేళ్ళలో అన్ని వేళ్ళకంటే బొటనవేలు పెద్దగా ఉండేవారు చాలా తెలివి కలిగినవారుగా ఉంటారట. అంతేకాకుండా వీరిలో సృజనాత్మకత కూడా ఎక్కువగా ఉంటుందట. బొటనవేలి పక్కన వేళ్ళతో పోలిస్తే పొట్టిగా ఉన్నట్లయితే వీరు ఏ పనినైనా ఇట్టే సులభంగా చేయగలరు. కాలి రెండవ వేలు పొడవుగా ఉంటే ఆ అమ్మాయిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి ధైర్యం కూడా ఎక్కవే. ఒకవేళ కాలి బొటనవేలి కంటే పక్కన వేలు పొట్టిగా ఉన్నట్లయితే వీరు చాలా కలివిడిగా అందరితో తొందరగా కలిసిపోతారు.

కాలి మొదటి మూడు వేళ్ళు పొడవుగా ఉండి చివరి రెండు వేళ్ళు చిన్నగా ఉన్నట్లయితే వీరు చాలా శక్తివంతంగా దృఢంగా ఉంటారు. వీరిలో ఎవరు ఊహించని శక్తి దాగి ఉంటుంది. బొటన వేలు పక్కన వేళ్ళు బొటనవేలి కంటే పొట్టిగా ఉంటే వీరు లైఫ్‌ని అన్ని దక్కించుకుని జీవితంలో ఆనందంగా గడుపుతారు. మీరు కోరుకున్న వారి ప్రేమను అధికంగా పొందుతారు.

what happens if 2nd toe is bigger than first one

కాలి చిటికెన వేలు మినహా మిగిలిన నాలుగు వేళ్ళు సమానంగా ఉండేవారు కుటుంబానికి ఎక్కువ ప్రాముఖ్యతని ఇస్తారు. వీరు ఎదుటి వారు చెప్పే మాటలను చాలా శ్రద్ధగా విని ఆచరిస్తారు. కాలి వేళ్ళలో నాల్గవ వేలు పొట్టిగా ఉండే వారు కుటుంబానికి మరియు బంధుత్వం వంటి బంధాల పట్ల ఎక్కువ ఆసక్తి ఉండదు. వీరు బంధాలకు అసలు విలువ ఇవ్వరట.

చిటికెన వేలు నాల్గవ వేలికి అంటుకుని ఉంటే వీరు చాలా సిగ్గు, బిడియం, భయం కలిగి ఉంటారు. బిడియం ఎక్కువగా ఉండటం వలన బాధ్యతలకు కూడా దూరంగా ఉంటారు. వీరు నలుగురితో చాలా చమత్కారంగా మాట్లాడుతారు. కాని వీరిని ఎక్కువగా అందరూ ఇష్టపడరట. అదేవిధంగా చిటికెన వేలు నాల్గవ వేలికి దూరంగా ఉన్నట్లయితే వీరు సాహస ప్రియులు. అలాగే వీరు కూడా చాలా చమత్కారంగా మాట్లాడుతారట.

Admin

Recent Posts