Foot Index Finger Longer Than Thumb : మీ కాళ్ల వేళ్లను మీరు ఎప్పుడైనా గమనించారా? కొందరికి కాళ్ల వేళ్లు సమానంగా ఉంటే మరికొందరికి మొదటి రెండు లేదా మూడు వేళ్లు సమానంగా ఉంటాయి. చివరివి చిన్నగా ఉంటాయి. అలాగే కొందరిలో బొటన వేలు పక్కన వేలు పెద్దగా ఉంటుంది. మిగిలిన వేళ్లు చిన్నగా ఉంటాయి. ఇలా ఉంటే అందరి మీద పెత్తనం చెలాయిస్తారని, స్త్రీలు తమ భర్తను నోరు తెరవనివ్వరని, పెద్ద గయ్యాళి అని, అలాగే మగవాళ్లు కూడా భార్యపై పెత్తనం చేస్తాడని అంటూ ఉంటారు. ఇంతకీ ఇది ఎంత వరకు నిజం.. అసలు ఇది నిజమేనా..? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మీ కాలి వేళ్లు అన్ని సమానంగా ఉంటే మీరు చాలా నమ్మకమైన వ్యక్తి అని అర్థం. మీకు ఉన్న సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని చెప్పొచ్చు. అలాగే మీరు జీవితంలో కష్టపడే వ్యక్తి అని కూడా అర్థం. మీ బాధ్యతలను మీరు సక్రమంగా నిర్వర్తిస్తారు. అలాగే కాలి వేలు మొదటి మూడు సమానంగా ఉండి మిగిలిన రెండు చిన్నగా ఉంటే మీది రోమన్ పాదం అని అంటారు. ఇలాంటి పాదం ఉన్న వారు అందరితోనూ స్నేహంగా ఉంటారు. ఇతరుల పట్ల దయను కలిగి ఉంటారు. త్వరగా అందరితో కలిసిపోతూ ఉంటారు. అలాగే జీవితంలో కూడా బ్యాలెన్డ్స్ గా ఉంటారని అర్థం. అలాగే కాలి బొటన వేలు పెద్దగా ఉండి మిగిలిన వేళ్లు చిన్నగా ఉంటే మీది ఈజిప్షియన్ ఫూట్ అని అర్థం. మీరు ఎక్కువగా స్వతంత్ర ఆలోచనలు కలిగి ఉంటారు. మొండిగా ఉంటూ మీ నిర్ణయాలను మీరే తీసుకుంటారు.
అలాగే మీరు చాలా నమ్మకంగా కూడా ఉంటారు. ఇక బొటన వేలు పక్కన వేలు పెద్దగా ఉండి మిగిలిన వేళ్లు చిన్నగా ఉంటే మీది గ్రీకు పాదం అని అర్థం. ఇలాంటి పాదం కలిగిన వారు చాలా సున్నితంగా ఉంటారు. ఇలాంటి వారు చాలా ఎమోషన్ పర్సన్ అని చెప్పవచ్చు. అలాగే వీరు అందరితో త్వరగా కలిసిపోతారు. అందరితో స్నేహంగా ఉంటారు. చాలా శక్తివంతంగా, సృజనాత్మకంగా ఉంటారు. జీవితంలో గొప్ప స్థానానికి చేరుకుంటారు. బొటన వేలు పక్కన వేలు పెద్దగా ఉంటే గయ్యాళి అయి ఉంటారని అందరూ అంటుంటారు.. కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదు.