Salt : వాస్తు శాస్త్రంలో ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వాస్తు ప్రకారం ఉప్పును ఉపయోగించడం వల్ల మనం అనేక దోషాల నుండి బయటపడవచ్చు. ఉప్పును ఉపయోగించడం వల్ల ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీని తొలగించుకోవచ్చు. అలాగే ఉప్పును లక్ష్మీదేవితో పోల్చుతారు. అందుకే ఉప్పును తొక్కకూడదని ఒకరి చేతి నుండి మరొకరి చేతికి ఉప్పును ఇవ్వకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. అలాగే నీటిలో ఉప్పు వేసి ఆ నీటితో ఇల్లు తుడవడం వల్ల ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఈ విధంగా ఉప్పుకు సంబంధించిన అనేక పరిహారాలను మనం నిత్యం చేస్తూ ఉంటాము.
వాస్తు శాస్త్రంలో ఉన్న ఉప్పు గురించిన మరో పరిహారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారానికి ఉప్పు మూట కట్టడం వల్ల మనకు ఎంతో మంచి జరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంటి ప్రధాన ద్వారానికి ఉప్పును కట్టడం వల్ల ఇంట్లో ఉండే వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఉప్పు కట్టడం వల్ల ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అంతేకాకుండా ఇంటి ప్రధాన ద్వారానికి ఉప్పు కట్టడం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో గొడవలు జరగకుండా ఉంటాయి. అలాగే ఇంటి ప్రధాన ద్వారానికి ఉప్పు కట్టడం వల్ల ఇంటి యజమాని జాతకంలో ఉండే శుక్ర దోషాలు తొలగిపోతాయి. ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయి.
ఆర్థిక సంక్షోభం నుండి త్వరగా బయటపడతారు. అప్పులు తొలగిపోవడంతో పాటు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంట్లో ప్రశాంతత, సుఖ సంతోషాలు నెలకొంటాయి. అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. ఈవిధంగా ఇంటి ప్రధాన ద్వారానికి ఉప్పును కట్టడం వల్ల మనకు ఎంతో మేలు కలుగుతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.