విటమిన్‌ సి వేటిలో ఎక్కువగా లభిస్తుందో తెలుసా ? కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం..!

మనకు రోజూ అవసరం అయ్యే అనేక రకాల విటమిన్లలో విటమిన్‌ సి ఒకటి. ఇది మన శరీరానికి చాలా ముఖ్యమైన పోషక పదార్థం. విటమిన్‌ సి వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్‌, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. మధుమేహం అదుపులో ఉంటుంది. చర్మం సంరక్షించబడుతుంది.

విటమిన్‌ సి వేటిలో ఎక్కువగా లభిస్తుందో తెలుసా ? కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం..!

అయితే విటమిన్‌ సి ఉన్న ఆహారాలను రోజూ తీసుకుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. కానీ విటమిన్‌ సి వేటిలో ఎక్కువగా ఉంటుందో చాలా మందికి తెలియదు. అవే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

విటమిన్‌ సి మనకు ఎక్కువగా పచ్చి మిరపకాయల్లో లభిస్తుంది. అవును.. మీరు నమ్మలేకున్నా ఇది నిజమే. 100 గ్రాముల పచ్చిమిరపకాయల్లో 242 మిల్లీగ్రాముల మేర విటమిన్‌ సి లభిస్తుంది. అయితే అలాగని చెప్పి 100 గ్రాముల పచ్చి మిరపకాయలను రోజూ తినలేం కదా. కానీ స్వల్ప మోతాదులో అయినా సరే వీటిని తీసుకోవాల్సి ఉంటుంది.

ఇక పచ్చిమిరపకాయల తరువాత మనకు విటమిన్‌ సి ఎక్కువగా జామ కాయల్లో లభిస్తుంది. 100 గ్రాముల జామ కాయలను తింటే 228 మిల్లీగ్రాముల మేర విటమిన్‌ సి లభిస్తుంది. కనుక రోజుకు రెండు జామకాయలను తినడం వల్ల బోలెడంత విటమిన్‌ సి లభిస్తుంది. ఇవి మనకు తక్కువ ధరకే లభిస్తాయి. కనుక వీటిని తింటే విటమిన్‌ సి ని పొందవచ్చు. విటమిన్‌ సి మనల్ని ఎన్నో రకాలుగా రక్షిస్తుంది.

ఇక విటమిన్‌ సి ఎక్కువగా క్యాప్సికం, నిమ్మ, కివీలు, కొత్తిమీర, స్ట్రాబెర్రీలు, నారింజ, ఆలుగడ్డలు, చిలగడదుంపలు, కాలిఫ్లవర్‌, క్యాబేజీలలో లభిస్తుంది. వీటిని తీసుకోవడం వల్ల విటమిన్‌ సి లభిస్తుంది. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts