పోష‌ణ‌

విటమిన్‌ డి లోపముందని టాబ్లెట్లు వేసుకుంటున్నారా? ఎక్కువైనా ప్రమాదమేనండోయ్‌..

శరీరంలో ఏదైనా లోపం ఉందంటే చాలు అది విటమిన్‌ డి అనుకుంటాం. అలా అందరికీ నోటిలో నానిన పేరు విటమిన్‌ డి. ఇది లోపించడం వల్ల ఎముకలు దృఢంగా లేకపోవడం, చిన్న వయసులోనే కాళ్లు వంగిపోవడం, వెన్నెముక వంగడం లాంటివి గమనిస్తూనే ఉంటాం. విటమిన్‌ డి సూర్యరశ్మి వల్ల బాగా దొరుకుతుంది. అది కాకుండా ఆహార పదార్థాలలో కూడా విటమిన్‌ డి దొరుకుతుంది. ఇది ఎక్కువైతే ఎలాంటి అనర్థాలకు దారితీస్తుందో చూద్దాం.

అంతకుముందు పిల్లల్లో విటమిన్‌ డి లోపం వచ్చేది కాదు ఎందుకంటే.. స్కూల్‌కి నడిచివెళ్లేవారు ఆ సమయంలో సూర్యరశ్మి బాగా తగులుతుంది. ఆ తర్వాత సాయంత్రం ఎండలో ఆడుకోవడం వల్ల కూడా విటమిన్‌ డి దొరికేది. కానీ ఇప్పుడు సూర్యుడు వచ్చేసరికి స్కూల్‌లో ఉంటారు. సాయంత్రం ఆటలు కూడా ఉండవు. పొద్దుపొడిచిన తర్వాత ఇంటికి వస్తారు. ఇక సూర్యరశ్మి శరీరంపై పడేదెప్పుడు విటమిన్‌ డి వచ్చేదెప్పుడు. ఈ లోపం పెద్ద వారిలో ఉండేది కాదు. వారు నిరంతరం ఎండలోనే పనిచేసేవారు కాబట్టి. ఇప్పుడు ఉద్యోగం పేరుతో వీరి పరిస్థితి కూడా పిల్లల పరిస్థితిలా మారిపోయింది. అయినా ఒక సూర్యరశ్మితో శరీరానికి కావాల్సిన విటమిన్‌ డి సరిపోదు. అందుకనే ఆ విటమిన్‌ ఉండే ఆహార పదార్థాలను అధికంగా తీసుకుంటున్నారు. అలా తీసుకోవడం వల్ల శరీరంలోకి ఎంత మొత్తంలో వెళ్తుందో కూడా అంచనా ఉండదు. అలాంటప్పుడు విటమిన్‌ డి ఎక్కువై అనర్థాలకు దారి తీస్తున్నదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

what happens if you take vitamin d tablets excessively

కలిగే అనర్థాలు :.. ఇప్పటి వరకు శరీరంలో విటమిన్‌ డి వల్ల ఎదురయ్యే లోపాలే చాలామందికి తెలుసు. ఇది ఎక్కువైతే కలిగే లోపాలు.. – చాలామంది ఓరల్‌ సిరప్స్‌ రూపంలోనూ, టాబ్లెట్స్‌ రూపంలో విటమిన్‌ డి పొందుతున్నారు. అయితే విటమిన్‌ డి అతిగా తీసుకుంటే మాత్రం కిడ్నీలకు ప్రమాదమని ఓ పరిశోధనలో తేలింది. వాస్తవానికి సూర్యరశ్మి ద్వారా విటమిన్‌ డి మనకు సహజంగానే లభిస్తుంది.

– అలాగే ఆహారం, పప్పుదినుసులు, కూరగాయలు విరివిరిగా తీసుకుంటే సరిపోతుంది. అయితే కొందరు డాక్టర్లు సూచన లేకుండా మెడిసిన్ల రూపంలో విటమిన్‌ డి పొందుతున్నారు. అలా తెలియకుండా ఒక్కోసారి అధికమొత్తంలో విటమిన్‌ డి తీసుకుంటే కిడ్నీలు చెడిపోతాయి. అంతేకాకుండా అధిక రక్తపోటు, అలసట, రక్తంలో క్యాల్షియం పెరగడం, వికారం, వాంతులు ఆకలి మందగించడం తరుచూ మూత్ర విసర్జన ఇలా చివరకు కిడ్నీ సమస్యలకు దారితీస్తాయి.

Admin

Recent Posts