Black Grapes : మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆరోగ్యం చక్కగా ఉండడానికి గానూ మనం రకరకాల వ్యాయామాలను, యోగా, వాకింగ్ వంటి వాటిని చేస్తూ ఉంటాం. అలాగే రకరకాల పండ్లను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మన ఆరోగ్యానికి మేలు చేసే పండ్లల్లో నల్ల ద్రాక్ష కూడా ఒకటి. వీటిని మనలో చాలా మంది ఇష్టంగా తింటారు. ఇతర పండ్లతో పోలిస్తే నల్ల ద్రాక్షలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు అధికంగా ఉంటాయి. 100 గ్రాముల నల్ల ద్రాక్షలో 69 క్యాలరీల శక్తి ఉంటుంది. వీటిలో అసలు కొలెస్ట్రాల్ ఉండదు. ఈ నల్ల ద్రాక్షలో విటమిన్ సి, పొటాషియం, విటమిన్ ఎ , ఐరన్, కాపర్, మెగ్నీషియం, బి కాంప్లెక్స్ విటమిన్స్ లతో పాటు ఎలక్ట్రోలైట్ లు కూడా వీటిలో పుష్కలంగా ఉంటాయి.
నల్ల ద్రాక్ష పండ్లను నేరుగా లేదా వీటిని జ్యూస్ గా చేసుకుని కూడా తాగవచ్చు. అయితే తాజాగా ఉన్న నల్ల ద్రాక్షను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం మరిన్ని చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు. నల్ల ద్రాక్షణు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆస్థమా వ్యాధి అదుపులో ఉంటుంది. అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉండచంలో కూడా నల్ల ద్రాక్ష మనకు దోహదపడుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చేయడంలో కూడా ఈ నల్లద్రాక్ష మనకు ఉపయోగపడుతుంది. దీంతో మనం గుండెపోటు బారిన పడే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. అలాగే నల్ల ద్రాక్షలో ఉండే ఫైటో కెమికల్స్ గుండె కండరాలకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఇవి రక్తంలో ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్ ఆక్సీకరణ చర్యలను నివారించడంలో తోడ్పడతాయి. దీంతో రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడే అవకాశం తగ్గుతుంది.
నల్ల ద్రాక్షను తినడం వల్ల పెద్ద ప్రేగు క్యాన్సర్, రొమ్మ క్యాన్సర్ వంటి వివిధ రకాల క్యాన్సర్ ల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే ప్రస్తుత కాలంలో చాలా మంది ఎసిడిటీ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యతో బాధపడే వారు ప్రతి రోజూ ఉదయం పరగడుపున ఒక గ్లాస్ తాజా నల్ల ద్రాక్ష జ్యూస్ ను తాగడం వల్ల లేదా వాటిని నేరుగా తినడం వల్ల ఎసిడిటీ సమస్య తగ్గుతుంది. అజీర్తి, మలబద్దకం వంటి సమస్యల నుండి బయటపడవచ్చు. ఈ జ్యూస్ ను తాగడం వల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. మైగ్రేన్ వంటి తలనొప్పితో బాధపడే వారు ప్రతిరోజూ ఉదయం నల్ల ద్రాక్ష జ్యూస్ ను పరగడుపున తాగాలి. ఇలా వారం రోజుల పాటు తీసుకోవడం వల్ల మైగ్రేన్ సమస్య తగ్గుతుంది. అలాగే జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడే వారు నల్ల ద్రాక్షను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
వీటిని తీసుకోవడం వల్ల జుట్టుకు తగినంత పోషణ లభించడంతో పాటు జుట్టుకు రక్తప్రసరణ కూడా చక్కగా జరుగుతుంది. దీంతో జుట్టు రాలడం తగ్గడంతో పాటు జుట్టు అందంగా, మృదువుగా తయారవుతుంది. అలాగే చర్మ సమస్యలతో బాధపడే వారు నల్ల ద్రాక్షను పేస్ట్ గా చేసి ముఖానికి రాసుకోవడం వల్ల చర్మ సమస్యల నుండి బయటపడవచ్చు. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. మధుమేహంతో బాధపడే వారు నల్ల ద్రాక్షను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
అధిక బరువుతో బాధపడే వారు కూడా వీటితో చేసిన జ్యూస్ ను తాగడం వల్ల చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. నల్ల ద్రాక్ష జ్యూస్ ను తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ చేరకుండా ఉంటుంది. అల్జీమర్స్, మతిమరుపు సమస్యలతో బాధపడే వారు కూడా వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ విధంగా నల్లద్రాక్ష మనకు ఎంతో ఉపయోగపడుతుందని వీటిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.