Anjeer In Summer : డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికీ తెలుసు. వీటిని తినడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభ్యమవుతాయి. మనం రకరకాల డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో అంజీర్ పండ్లు ఒకటి. ఇవి మనకు డ్రై ఫ్రూట్స్ రూపంలోనే కాకుండా పండ్ల రూపంలోనూ లభిస్తూ ఉంటాయి. అంజీరాలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. పలు రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలోనూ ఈ పండ్లు సహాయపడతాయి. అంజీరా పండ్లు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అంజీరా పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వీటిని కొన్ని ప్రాంతాలలో అత్తి పండు అని కూడా అంటారు. రక్త హీనతను తగ్గించడంలో అంజీరా పండ్లు ఎంతో సహాయపడతాయి. రోజుకి రెండు లేదా మూడు అంజీరాలను తినడం వల్ల రక్త హీనత సమస్య తగ్గుతుంది. పిల్లల నుండి వృద్దుల వరకు ఎవరైనా ఈ పండ్లను తినవచ్చు. షుగర్ వ్యాధి గ్రస్తులు కూడా వీటిని నిర్భయంగా తినవచ్చు. అంజీరా పండ్లను తినడం వల్ల వెక్కిళ్లు తగ్గుతాయి. జలుబు చేసిన వారు అంజీరా పండ్ల రసాన్ని తాగడం వల్ల జలుబు త్వరగా తగ్గుతుంది. అంజీరా పండ్లల్లో పొటాషియం, మెగ్నిషియం, ఐరన్ లతోపాటు ఫైబర్, కార్బొహైడ్రేట్స్ కూడా అధికంగా ఉంటాయి. భోజనానికి రెండు గంటల ముందు ఈ పండ్లను తినడం వల్ల కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. దీంతో మనం తక్కువగా ఆహారాన్ని తీసుకంటాం. కనుక మనం త్వరగా బరువు తగ్గుతాం.
వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) స్థాయిలు తగ్గి హార్ట్ ఎటాక్, హార్ట్ స్ట్రోక్ లు వంటివి రాకుండా ఉంటాయి. ఈ పండ్లల్లో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా చేయడంలో సహాయపడుతుంది. ఎముకలు విరిగిన వారు ఈ పండ్లను తినడం వల్ల నొప్పులు తగ్గి ఎముకలు త్వరగా అతుకుంటాయి. గొంతు నొప్పిని, దగ్గును తగ్గించడంలోనూ ఇవి దోహదపడతాయి. రక్తంలో ఉండే మలినాలను తొలగించి రక్తాన్ని శుద్ది చేయడంలో ఇవి ఎంతో సహాయం చేస్తాయి.
ఇక వేసవిలో ఈ పండ్లను తినడం అసలు మరిచిపోవద్దు. ఎందుకంటే ఈ సీజన్‌లో మనకు జీర్ణ సమస్యలు సహజంగానే వస్తుంటాయి. ముఖ్యంగా వేడి కారణంగా విరేచనాలు అవడం, మూత్రం సరిగ్గా రాకపోవడంతోపాటు అజీర్ణం, గ్యాస్, కడుపులో మంట కూడా బాధిస్తుంటాయి. అలాంటి వారు అంజీర్ పండ్లు 3 తీసుకుని రాత్రి పూట నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపునే తినాలి. దీంతో ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
తరచూ అంజీరా పండ్లను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. జ్వరాలు వచ్చి రక్తంలో ప్లేట్ లేట్స్ తగ్గిన వారు వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో ప్లేట్ లేట్స్ సంఖ్య పెరుగుతుంది. సంతాన లేమి సమస్యలను తగ్గించడంలోనూ ఈ పండ్లు ఎంతో సహాయపడతాయి. రోజుకి రెండు చొప్పున ఈ పండ్లను తినడం వల్ల ముఖంపై వచ్చే మొటిమలు తగ్గుతాయి. బీపీని నియంత్రించడంలో, జీర్ణ శక్తిని మెరుగుపరచడంలో అంజీర పండ్లు దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు. అంజీరా పండ్లను నేరుగా లేదా డ్రై ఫ్రూట్స్ రూపంలో తీసుకున్నా మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు.