Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

అమ్మ గొప్ప‌త‌నాన్ని అద్భుతంగా వివ‌రించే క‌థ‌.. క‌ళ్ల‌కు ఆనంద భాష్పాలు వ‌స్తాయి..

Admin by Admin
April 9, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

దుకాణం మధ్య లో ఓ అట్టముక్క వ్రేలాడుతూ నా దృష్టి ని ఆకర్షించింది, కుతూహలం తో దానిపై ఏమి రాయబడి ఉందోనని చూసాను, దానిమీద అయ్యా! నా తల్లికి ఆరోగ్యం సరిగ్గా లేనందున నేను ఆమెకు సేవ చేయుటకు సదా ఆమె దగ్గర ఉండవలసి ఉన్నది, కావున మీరు మీకు కావలసిన పళ్ళు తీసుకుని దానికి తగ్గ డబ్బు ను ఈ గళ్ళా పెట్టె లో వేయగలరు అని ఉంది. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఈకాలం లో కూడా ఇలాంటి అమాయకులు ఉంటారా? అని, దొంగలు ఆ గల్లా పెట్టె ను ఎత్తుకెళితే ఇతని పరిస్థితి ఏంటి? ఇతని అమాయకత్వానికి నాకు నవ్వు వచ్చింది, ఎలాగైనా ఇతనికి ఇలా చేయకూడదు అని గట్టిగా చెప్పాలి అని నిర్ణయించుకొని సాయంత్రం అతను డబ్బు తీసుకునుటకు దుకాణం కు వస్తాడు కదా అని నేను కూడా సాయంత్రం మళ్ళీ పళ్ళ దుకాణం కు చేరుకున్నాను, పళ్ళ దుకాణం యజమాని వచ్చి గల్లా పెట్టెను తీసుకుని దుకాణం కట్టి వేస్తున్నాడు,

నేను అతని దగ్గరికి వెళ్లి నన్ను నేను పరిచయం చేసుకుని నీవు ఎంత తెలివి తక్కువ పని చేస్తున్నావో తెలుసా? ఎవరైనా దొంగలు నీ గల్లా పెట్టె ను ఎత్తుకెళితే ఎలా? పళ్ళ ను ఊరికే తీసుకుపోతే ఎలా? అని మందలించబోయాను. అందుకు అతను చిరునవ్వుతో అంతా దైవేచ్ఛ అన్నాడు. మళ్ళీ అతనే అయ్యా! మొదట్లో నేను నా తల్లితో మీలాగే అడిగాను, నేను నీ సేవలో ఉంటే దుకాణం పరిస్థితి ఎలా? అని, అందుకు మా అమ్మ నాయనా! నాకు రోజులు దగ్గర పడ్డాయి, రోజూ నిన్ను చూడకుండా ఉండలేను, నేను ఆ దేవున్ని ప్రార్ధిస్తాను, నీవు నేను చెప్పిన విధంగా చేయి, అని చెప్పింది, అమ్మ చెప్పినట్టుగానే ఆరోజు నుండి ఈవిధంగా చేస్తున్నాను అన్నాడు.

this story tells how wonderful mother is

మరి నీకు ఏనాడూ నష్టం రాలేదా? అని అడిగాను కుతూహలం ఆపుకోలేక… అతను అదే చిరునవ్వుతో నష్టమా???.. అన్నాడు. ఒకసారి ఈ గల్లా పెట్టెను చూడండి అని అతని గల్లాపెట్టె ను తెరచి చూపించాడు, ఆశ్చర్యం! గల్లాపెట్టె నిండా డబ్బు! దుకాణంలోని పళ్ళ విలువ కంటే పదింతలు ఎక్కువగా ఉంటుంది. ఇవి చూడండి అని దుకాణం లో రకరకాల వస్తువులు చూపాడు… వాటిలో చీరలు, బట్టలు,స్వెట్టర్లు,అప్పుడే వండుకుని తెచ్చిన పులావు, రకరకాల తినుబండారాలు… ఉన్నాయి. అన్నింటిపైన భయ్యా! అమ్మ కు మా తరపున ఇవ్వండి అని రాసిన కాగితాలు ఉన్నాయి. అంకుల్ అమ్మను నా ఆసుపత్రి కి తీసుకురాగలరు, నేను అమ్మకు ఉచితంగా వైద్యం చేయగలను అని ఓ డాక్టర్ తన విజిటింగ్ కార్డు ను ఓ కాగితానికి కట్ఠి దుకాణం లో వ్రేలాడదీసి వెళ్ళాడు…

ఇదంతా చూసిన నాకు కళ్ళ వెంబడి నీళ్ళాగడం లేదు, సమాజమంతా స్వార్థం తో నిండిపోయింది, మంచితనం మచ్చుకైనా కనిపించడం లేదు అన్న నా భావన పటాపంచలైనట్టయింది. సమాజం లో మంచితనం ఇంకా బ్రతికే ఉంది, ముందు మన దృక్పథం లో మార్పు రావాలి, తల్లికి సేవచేస్తున్నందుకు గాను సాక్షాత్తు ఆ దేవుడే స్వయంగా అతని దుకాణం కు కాపలా కాస్తున్నాడు… ఎంతగా కోపగించుకున్నా తిరిగి మనపై కోప్పడనిది సృష్టి లో ఎవరైనా ఉన్నారంటే అదిఒక అమ్మ ఒక్కటే! అమ్మ కు చేసిన సేవ ఎప్పటికీ నిరర్ధకం కాదు.

Tags: mother
Previous Post

కోట శ్రీ‌నివాస రావుకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టిన సినిమా ఏదంటే..?

Next Post

పళ్లు తోమకుండా నీళ్లు తాగుతున్నారా.. ఏం జరుగుతుందంటే..

Related Posts

పోష‌ణ‌

మీ చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా క‌నిపించాలంటే వీటిని తీసుకోండి..!

July 3, 2025
చిట్కాలు

ప‌సుపు రంగులోకి మారిన మీ దంతాలు మళ్లీ తెల్ల‌గా మారాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 3, 2025
హెల్త్ టిప్స్

డ‌యాబెటిస్ ఉన్న‌వారు వీటిని తింటే షుగర్‌ను కంట్రోల్ చేయ‌వ‌చ్చు..!

July 3, 2025
వినోదం

బాలీవుడ్ న‌టి హేమ మాలిని మామూలు వ్య‌క్తి కాదు.. ఆమెకు ఎంత‌టి బ్యాక్ గ్రౌండ్ ఉందంటే..?

July 3, 2025
information

ఆర్మీ వాహ‌నాల నంబ‌ర్ ప్లేట్‌పై ఉండే బాణం గుర్తు పైకి ఉంటుంది.. ఎందుక‌ని..?

July 3, 2025
information

గెజిటెడ్‌ ఆఫీసర్ అర్థం ఏమిటి? నిర్దిష్టమైన వ్యక్తులను మాత్రమే మనం గెజిటెడ్ ఆఫీసర్ అని ఎలా గుర్తించగలుగుతాం..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.