పండ్లు

ఎన్నో పోషకాలను కలిగి ఉండే ఆలుబుకర పండ్లు.. తింటే అనేక ప్రయోజనాలు..!

ఆలుబుకర పండ్లు చూసేందుకు ఎరుపు రంగులో ఉంటాయి. ఇవి పుల్లగా ఉంటాయి. కానీ వీటిలో పోషకాలు అధికంగా ఉంటాయి. మనకు ఈ పండ్లు మార్కెట్‌లో ఎక్కడ చూసినా లభిస్తాయి. వీటిని తినడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

health benefits of aloo bukhara fruits

1. ఆలుబుకర పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. మన శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్‌ ఈ పండ్లలో ఉంటాయి. ఈ పండ్లలో విటమిన్‌ ఎ, సి, ఫోలేట్‌, విటమిన్‌ కె, బి1, మెగ్నిషియం, ఫాస్ఫరస్‌, జింక్‌, కాల్షియం, పొటాషియం తదితర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఫైబర్‌ కూడా పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఈ పండ్లను తింటే పోషణ లభిస్తుంది. శక్తి అందుతుంది.

2. ఆలుబుకర పండ్లలో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. అలాగే సార్బిటాల్‌, ఇసాటిన్‌ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి లాక్సేటివ్‌గా పనిచేస్తాయి. దీంతో మలబద్దకం సమస్య తగ్గుతుంది.

3. ఆలుబుకర పండ్లలో విటమిన్‌ సి, బీటా కెరోటిన్‌లు అధికంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. కళ్లలో శుక్లాలు ఏర్పడకుండా చూస్తాయి. ఈ పండ్లలో కెరోటినాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. లుటీన్‌, జియాంతిన్‌లు అధికంగా లభిస్తాయి. దీని వల్ల అతినీలలోహిత కిరణాల నుంచి కళ్లు సురక్షితంగా ఉంటాయి.

4. ఆలుబుకర పండ్లను తినడం వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.

5. ఆలుబుకర పండ్లలో విటమిన్‌ సి ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్‌ఫెక్షన్లు, వాపులు రాకుండా చూస్తుంది.

6. ఆలుబుకర పండ్లలో విటమిన్‌ కె, పొటాషియం ఉంటాయి. వీటిలో ఐరన్‌ ఉంటుంది. అందువల్ల రక్తం తయారవుతుంది. రక్తహీనత సమస్య ఉన్నవారు ఈ పండ్లను తినాలి. ఈ పండ్లలో ఉండే కాపర్‌ ఎర్ర రక్త కణాలు ఏర్పడేందుకు సహాయ పడుతుంది. దీంతోపాటు రక్తం శుద్ధి అవుతుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది.

7. ఆలుబుకర పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది ఎలక్ట్రోలైట్‌గా పనిచేస్తుంది. దీంతో శరీరంలోని కణాలు సరిగ్గా పనిచేస్తాయి. అలాగే కండరాల పనితీరు మెరుగు పడుతుంది.

8. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్ ను నాశనం చేస్తాయి. న్యూరాన్లను సంరక్షిస్తాయి.

9. ఆలుబుకర పండ్లలో ఉండే విటమిన్‌ సి చర్మాన్ని సంరక్షిస్తుంది. దీని వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. యవ్వనంగా కనిపిస్తారు. చర్మంపై ముడతలు తగ్గుతాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts