మార్కెట్‌లో మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల తక్కువ ధర కలిగిన పండ్లలో బత్తాయి పండ్లు ఒకటి. వీటిల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి సిట్రస్ జాతికి చెందిన పండ్లు. అంటే విటమిన్ సి సమృద్ధిగా ఉంటుందన్నమాట. ఇక ఈ పండ్లకు చెందిన జ్యూస్‌ను రోజూ ఒక గ్లాస్ మోతాదులో తాగితే దాంతో అనేక రకాల లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
బత్తాయి పండ్లలో ఫ్లేవనాయిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణాశయాన్ని శుభ్రం చేస్తాయి. దీంతో జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. అందువల్ల రోజూ ఒక గ్లాస్ బత్తాయి రసం తాగాలి.
డయాబెటిస్‌తో బాధపడుతున్నవారికి బత్తాయి రసం ఎంతో మేలు చేస్తుంది. బత్తాయి రసంలో కొద్దిగా నిమ్మరసం, తగినంత తేనె కలిపి రోజూ ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌తో తీసుకోవాలి. దీంతో షుగర్ లెవల్స్ ను తగ్గించుకోవచ్చు.
బత్తాయి రసాన్ని తాగడం వల్ల శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. మలబద్దకం తగ్గుతుంది.
బత్తాయి పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది కనుక శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు.
బత్తాయి రసాన్ని రోజూ తాగడం వల్ల అధిక బరువు తగ్గుతారు. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.