టీ ట్రీ ఆయిల్ ఒక ఎసెన్షియల్ ఆయిల్. మనకు బయట మార్కెట్‌లో ఈ ఆయిల్ లభిస్తుంది. దీన్ని అనేక రకాల సమస్యలకు ఉపయోగించవచ్చు. చర్మం, వెంట్రుకలు, గోళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఈ ఆయిల్‌ను ఎవరైనా సరే నిరభ్యంతరంగా వాడవచ్చు. దీంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. టీ ట్రీ ఆయిల్ సహజ సిద్ధమైన హ్యాండ్ శానిటైజర్‌లా పనిచేస్తుంది. దీన్ని చేతులకు రాసుకుంటే సూక్ష్మ క్రిములు నశిస్తాయి. ఇ.కొలి, న్యుమోనియా, ఇన్‌ఫ్లుయెంజా లాంటి బాక్టీరియా, వైరస్‌లను నాశనం చేసే శక్తి ఈ ఆయిల్‌కు ఉంటుంది. అందువల్ల దీన్ని హ్యాండ్ శానిటైజర్‌లా ఉపయోగించవచ్చు.
2. టీ ట్రీ ఆయిల్ ను స్ప్రే బాటిల్ లో పోసి దాన్ని అక్కడక్కడా స్ప్రే చేస్తుంటే దోమలు, కీటకాలు, పురుగులు నశిస్తాయి.
3. టీ ట్రీ ఆయిల్ సహజసిద్ధమైన డియోడరెంట్‌లా కూడా పనిచేస్తుంది. దాన్ని చంకల్లో రాసుకోవచ్చు. చెమట పట్టినా వాసన రాకుండా ఉంటుంది.
4. కాలిన గాయాలు, దెబ్బలు, పుండ్లపై ఈ ఆయిల్‌ను రాస్తుంటే అవి త్వరగా మానుతాయి.
5. మొటిమలపై ఈ నూనెను రోజూ రాత్రి అప్లై చేస్తుండాలి. ఉదయం కడిగేయాలి. ఇలా చేస్తుంటే తప్పక ఫలితం కనిపిస్తుంది.
6. గోళ్లకు ఫంగస్ వస్తే ఈ ఆయిల్‌ను రాస్తుండాలి. దీంతో ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.
7. టీ ట్రీ ఆయిల్ ను సహజసిద్ధమైన మౌత్ వాష్ లా కూడా ఉపయోగించవచ్చు. దీంతో నోరు శుభ్రమవుతుంది. ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ ను వేసి బాగా కలిపి ఆ మిశ్రమంతో నోటిని పుక్కిలించాలి. కనీసం 1 నిమిషం పాటు అలా చేయాలి. దీంతో నోరు శుభ్రమవుతుంది.
8. శరీరంపై వాపులు ఉన్న చోట ఈ ఆయిల్‌తో మర్దనా చేస్తే ఫలితం ఉంటుంది.
9. చుండ్రును తగ్గించడంలోనూ ఈ ఆయిల్ బాగా పనిచేస్తుంది. వారంలో 3 సార్లు తలకు ఈ ఆయిల్‌ను బాగా పట్టించి గంట సేపు ఆగి తలస్నానం చేయాలి. దీంతో చుండ్రు తగ్గడమే కాక శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి.