Plums : మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో ప్లమ్ కూడా ఒకటి. ఈ పండ్లను తినడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పండ్లు పుల్లగా, తియ్యగా చాలా రుచిగా ఉంటాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీనిలో విటమిన్ ఇ, బీటా కెరోటీన్ లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుండి మన చర్మాన్ని రక్షిస్తాయి. ఈ పండును తినడం వల్ల వదులుగా మారిన చర్మం బిగుతుగా తయారవుతుంది. ఈ పండును తినడం వల్ల వృద్దాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి. ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించాలి అనుకునే వారికి ఈ పండు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే నల్లగా మారిన పెదాలను ఎర్రగా మార్చడంలో కూడా ఈ పండు మనకు దోహదపడుతుంది. ఈ పండు పై ఉండే పొట్టుతో పెదాలకు మర్దనా చేయడం వల్ల నల్లగా ఉన్న పెదాలు తెల్లగా మారుతాయి.
అలాగే మెత్తగా, మృదువుగా తయారవుతాయి. అలాగే ఈ పండులో యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలు కూడా అధికంగా ఉంటాయి. చాలా మంది ముఖం పై మొటిమలు, వాటి తాలుకూ మచ్చలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా ముఖంపై మొటిమలతో ఇబ్బంది పడే వారు ప్లమ్ ఫ్రూట్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటిని తినడం వల్ల మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. సూర్యకాంతి వల్ల నల్లగా మారిన చర్మాన్ని సాధారణ స్థితికి తీసుకు రావడంలో ఈ పండ్లు సమర్థవంతంగా పని చేస్తాయి. వీటిని తినడం వల్ల మనం పలు రకాల క్యాన్సర్ ల బారిన కూడా పడకుండా ఉంటాము. అదే విధంగా జుట్టు రాలడాన్ని తగ్గించడంలో, చుండ్రు సమస్యను నివారించడంలో ఈ పండ్లు మనకు ఎంతో సహాయపడతాయి. ప్లమ్ ఫ్రూట్ లో ఉండే క్యాల్షియం ఎముకలు ధృడంగా ఉంచడంలో తోడ్పడుతుంది.
అలాగే దీనిలో అధికంగా ఉండే పీచు పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహయపడతాయి. ఈ పండ్లను తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడంతో పాటు రక్తప్రసరణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. అలాగే ఈ పండ్లల్లో పుష్కలంగా ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరచడంలో దోహదపడుతుంది. అలాగే దీనిలో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. కనుక గర్భిణీ స్త్రీలు ఈ పండ్లను తినడం వల్ల మంచి ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే రక్తహీనత సమస్యతో బాధపడే వారు ఈ పండ్లను తినడం వల్ల రక్తహీనత సమస్య నుండి కూడా బయటపడవచ్చు. ఈ విధంగా ప్లమ్ ఫ్రూట్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ పండ్లను ఆహారంగా భాగంగా తీసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.