Raw Banana : మనలో చాలా మంది ఇష్టంగా తినే పండ్లల్లో అరటి పండు కూడా ఒకటి. అరటి పండు మనకు అన్ని కాలాల్లో విరివిరిగా లభిస్తుంది. అరటి పండు చాలా రుచిగా ఉంటుంది. అరటిపండులో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అరటి పండే కాకుండా అరటి చెట్టు ఆకులు, కాండం, వేర్లు కూడా వివిధ రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో మనకు దోహదపడతాయి. అయితే మనం సాధారణంగా పండిన అరటి పండ్లను మాత్రమే తింటూ ఉంటాం. మనకు పచ్చి అరటి పండ్లు దొరికినప్పటికి వాటిని మనం ఎక్కువ మోతాదులో ఆహారంగా తీసుకోము. కానీ మనం పచ్చి అరటికాయను కూడా తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
పండిన అరటి పండులో కంటే పచ్చి అరటికాయలోనే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. పచ్చి అరటికాయను తినడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. ప్రతిరోజూ ఒక పచ్చి అరటికాయను ఉడికించుకుని తింటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. పచ్చి అరటికాయను ఉడికించి తినడం వల్ల మన శరీరానికి కలిగే మేలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అరటికాయను ఉడికించుకుని తినడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. రోజూ ఉదయం పరగడుపున పచ్చి అరటికాయను ఉడికించి తినడం వల్ల మన శరీర బరువు తగ్గుతుంది. అలాగే పచ్చి అరటికాయను ఉడికించి తినడం వల్ల మనం మలబద్దకం సమస్య నుండి బయటపడవచ్చు. పొట్ట పూర్తిగా శుభ్రమవుతుంది.
అలాగే పచ్చి అరటి పండును తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. షుగర్ వ్యాధి గ్రస్తులు కూడా పచ్చి అరటిపండును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది. అలాగే దీనిని తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అదే విధంగా మెదడు పనితీరును మెరుగుపరచడంలో కూడా పచ్చి అరటికాయ మనకు సహాయపడుతుంది. రోజూ ఒక పచ్చి అరటికాయను ఉడికించుకుని తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పచ్చి అరటికాయలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరంలో రక్తహీనత సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఐరన్ మన శరీరంలో కొత్త రక్తం తయ్యేరయేలా చేస్తుంది. దీంతో మనం రక్తహీనత సమస్య మన దరి చేరకుండా చూసుకోవచ్చు. అలాగే పచ్చి అరటికాయను ఉడికించి తినడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఈ విధంగా పచ్చి అరటికాయ మనకు ఎంతగానో సహాయపడుతుందని దీనిని పరగడుపున ఉడికించి తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.