Thuniki Pandlu : తునికి పండ్లు.. వీటి గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ పండ్లు మనకు ఎక్కువగా అడవుల్లోలభిస్తాయి. అలాగే వేసవికాలంలో ఎక్కువగా లభిస్తాయి. ఇవి చూడడానికి సపోటా పండ్ల లాగా ఉంటాయి. వీటి లోపల 3 లేదా 4 గింజలు ఉంటాయి. ఈ పండ్లు చాలా తియ్యగా, కమ్మగా ఉంటాయి. ఈ పండ్లను తెండు ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. పండ్ల లోపల ఉండే గుజ్జును చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. గిరిజనులు ఈ పండ్లను జీవనోపాధికి కూడా ఉపయోగించుకుంటారు. తునికి పండ్లను తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. కడుపుకు సంబంధించిన వివిధ రకాల సమస్యలు తగ్గు ముఖం పడతాయి.
కడుపులో పుండ్లను తగ్గించడంలో, శరీరంలో రక్తాన్ని శుభ్రపరచడంలో, మూత్రనాళాల్లో అడ్డంకులను తొలగించడంలో ఇలా అనేక రకాలుగా ఇవి మనకు సహాయపడతాయి. నోటిపూతతో బాధపడే వారు ఈ పండ్లను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ప్రస్తుత కాలంలో పండ్లను పండించడానికి అనేక రకాల రసాయనాలను, పురుగు మందులను వాడుతున్నారు. కానీ తునికి పండ్లు మాత్రం మనకు సహజ సిద్దంగానే లభిస్తాయి. వీటిని తినడం వల్ల మన ఆరోగ్యానికి మేలు తప్ప హాని మాత్రం కలగదు. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే అనేక పోషకాలు ఉంటాయి. ఈ పండ్లల్లో ఎక్కువగా విటమిన్ ఎ, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి.
వీటిని తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాలానుగుణంగా లభించే పండ్లను మనం తప్పకుండా ఆహారంగా తీసుకోవాలి. ఇవి మనకు దొరికినప్పుడు ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం సంవత్సరమంతా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ విధంగా తునికి పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.