సీమ చింతకాయలు.. వీటిని చూస్తేనే చాలు, నోట్లో నీళ్లూరతాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా లభిస్తాయి. వీటిని అనేక ప్రాంతాల్లో భిన్నమైన పేర్లతో పిలుస్తారు. సీమ చింతకాయల చెట్లు ఒక్కోటి దాదాపుగా 10 నుంచి 15 మీటర్ల ఎత్తు పెరుగుతాయి. ఈ చెట్టుకు కాసే కాయలు ముందుగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. తరువాత ఎరుపు, పింక్ రంగులోకి మారుతాయి. బాగా పండిన సీమ చింతకాయలను తింటే భలే రుచిగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. సీమ చింతకాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి. శరీరంలో ప్లీహం తగ్గుతుంది. క్యాన్సర్‌పై పోరాడే గుణాలు ఈ కాయల్లో ఉంటాయి.
2. సీమ చింతకాయల్లో బి విటమిన్లు అధికంగా ఉంటాయి. అందువల్ల నాడులు, మెదడు పనితీరు మెరుగు పడుతుంది. వెంట్రుకలు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. ఆకలి పెరుగుతుంది. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది.
3. ఈ కాయల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది దంతాలు, ఎముకలను దృఢంగా మారుస్తుంది. అవి ఆరోగ్యంగా ఉంటాయి.
4. సీమ చింతకాయల్లో ఉండే థయామిన్ చక్కెరను శక్తిగా మారుస్తుంది. అందువల్ల మన శరీరానికి శక్తి లభిస్తుంది. ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి.
5. వీటిలో ఉండే ఫాస్ఫరస్ ఆరోగ్యాన్ని అందిస్తుంది.
6. రక్తహీనత సమస్య ఉన్నవారు సీమ చింతకాయలను తినవచ్చు. వీటిల్లో ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది. అలసట తగ్గుతుంది.
7. సీమ చింతకాయలను తినడం వల్ల దంతాలు, చిగుళ్ల సమస్యలు ఉండవు. దంతాలు, చిగుళ్లు దృఢంగా మారుతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. నోట్లో బాక్టీరియా నశిస్తుంది.
8. విరేచనాల సమస్య ఉన్నవారు సీమ చింతకాయలను తినడం వల్ల ఫలితం ఉంటుంది.
9. సీమ చింతకాయలను తినడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. అల్సర్లు, మలబద్దకం, మూత్రాశయ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
సూచన – సీమ చింతకాయలను తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలిగే మాట వాస్తవమే అయినప్పటికీ వీటిని గర్భిణీలు తినరాదు. ఎందుకంటే ఈ కాయల్లో అబార్టిఫేషియంట్ గుణాలు ఉంటాయి. అందువల్ల గర్భవిచ్ఛిత్తి అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఈ కాయలను మరీ అధికంగా కూడా తినరాదు. తింటే గొంతు ఇర్రిటేట్ అవుతుంది. గొంతు బొంగురు పోయినట్లు అనిపిస్తుంది. అందువల్ల వీటిని తిన్నవెంటనే నీటిని తాగాలి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365