Calcium : అవిసె గింజలు.. ఇవి మనందరికి తెలిసినవే. ఎంతో కాలంగా వీటిని మనం ఆహారంగా తీసుకుంటున్నాం. అవినె గింజలను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి కలిగే మేలు అంతా ఇంతా కాదు. వైద్యులు కూడా వీటిని ఆహారంగా తీసుకోమని సూచిస్తున్నారు. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్, పీచు పదార్థాలు ఇతర పోషకాలు అనేకం ఉన్నాయి. ప్రస్తుత కాలంలో మనల్ని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో గుండె సంబంధిత సమస్యలు ఒకటి. ఈ సమస్య కారణంగా మరణించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందనే చెప్పవచ్చు. ఈ గుండె సంబంధిత సమస్యలు మన దరి చేరకుండా ఉండాలంటే మనం తప్పకుండా అవిసె గింజలను ఆహారంగా తీసుకోవాలి. వీటిలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు ఈ అవిసె గింజలను తీసుకోవడం వల్ల మనం అనేక ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ అవిసె గింజలను ఎలా తీసుకోవడం వల్ల మనకు అధిక మేలు కలుగుతుంది.. వీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అవిసె గింజలను నీటిలో నానబెట్టి మొలకెత్తిన తరువాత తీసుకోవడం వల్ల మనం అధిక ప్రయోజనాలను పొందవచ్చు. ఇదే అవిసె గింజలను తీసుకునే ఉత్తమమైన మార్గం. మొలకెత్తిన అవిసె గింజలను తీసుకోవడం వల్ల వీటిలో ఉండే పోషకాలను పూర్తి స్థాయిలో మనం పొందవచ్చు.
ఈ మొలకలను తయారు చేసుకోలేని వారు వీటిని పొడిగా చేసి తీసుకోవాలి. కళాయిలో అవిసె గింజలను వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల పది రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఈ పొడిని రోజూ ఉదయం పరగడుపున ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ మోతాదులో వేసి కలిపి తాగాలి. అలా తాగలేని వారు దీనిని పెరుగులో కలిపి తీసుకోవచ్చు లేదా గోధుమపిండిలో కలిపి చపాతీలా చేసుకుని తినవచ్చు. ఈ విధంగా అవిసె గింజలను తీసుకోవడం వల్ల దీనిలో అధికంగా ఉండే పీచుపదార్థాలు పెద్ద ప్రేగును ఆరోగ్యంగా ఉంచుతాయి.
బరువు తగ్గాలనుకునే వారు ఈ అవిసె గింజలను తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల ఆకలి త్వరగా వేయదు. తద్వారా మనం సులభంగా బరువు తగ్గవచ్చు. ఈ అవిసె గింజలను తీసుకవడం వల్ల కడుపులో మంట, అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. చర్మ సంబంధిత సమస్యలను నయం చేసే గుణం కూడా అవిసె గింజలకు ఉంది. వీటిని తీసుకోవడం వల్ల మొటిమలు, ముడతలు వంటి సమస్యలు తగ్గి చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అవిసె గింజలను తీసుకోవడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు దాదాపు దూరం అవుతాయి.
అవిసె గింజలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. పలు రకాల క్యాన్సర్ లు మన దరి చేరకుండా ఉంటాయి. ఈ గింజల పొడిని నీటిలో కలిపి రోజూ ఉదయం తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడే వారు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. హార్మోన్ల అసమతుల్యత కారణంగా స్త్రీలల్లో వచ్చే సమస్యలను తగ్గించే గుణం కూడా ఈ గింజలకు ఉంది. మోనోపాజ్ దశలో ఉన్న స్త్రీలు వీటిని తీసుకోవడం వల్ల చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు.
అవిసె గింజలను తీసుకోవడం వల్ల జుట్టు సంబంధిత సమస్యలు తగ్గి జుట్టు పొడవుగా, బలంగా పెరుగుతుంది. ఆరోగ్యానికి మేలు చేస్తాయి కదా అని వీటిని ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. అలాగే గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు కూడా వీటిని తీసుకోకపోవడమే మంచిది. అవిసె గింజలను మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని, అందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.