కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 5 ఆహారాలను కచ్చితంగా తినాల్సిందే..!

మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. ఇవి మన శరీరంలో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలను బయటకు పంపుతుంటాయి. అందువల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే పలు ఆహారాలను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అవేమిటంటే..

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 5 ఆహారాలను కచ్చితంగా తినాల్సిందే..! 

1. కిడ్నీల  ఆరోగ్యానికి వెల్లుల్లి, ఉల్లిపాయలు ఎంతో మేలు చేస్తాయి. వెల్లుల్లిలో సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, మాంగనీస్, విటమిన్‌ సి, బి6, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల వెల్లుల్లి కిడ్నీలకు ఎంతగానో మేలు చేస్తుంది. అలాగే ఉల్లిపాయల్లో ఫ్లేవనాయిడ్స్‌ ఉంటాయి. ఇవి కిడ్నీ వ్యాధులు రాకుండా కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

2.  కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేందుకు పాలకూర కూడా ఎంతగానో మేలు చేస్తుంది. ఇందులో బీటా కెరోటిన్, ఐరన్, మెగ్నిషియం, విటమిన్లు ఎ, సి, కె, ఫోలేట్‌ ఉంటాయి. ఇవి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

3. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచేందుకు పైనాపిల్‌ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. రోజూ పైనాపిల్‌ పండ్లను తింటుంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. వీటిల్లో ఉండే ఫైబర్‌, పొటాషియం, బ్రొమెలెయిన్‌ అనే ఎంజైమ్‌ కిడ్నీలను సంరక్షిస్తాయి.

4. కిడ్నీల  ఆరోగ్యానికి క్యాబేజీ కూడా పనిచేస్తుంది. క్యాబేజీలో అధిక మొత్తంలో విటమిన్లు కె, సి, బి లు ఉంటాయి. అలాగే ఫైబర్‌ కూడా ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.

5. కిడ్నీల  ఆరోగ్యానికి క్యాప్సికమ్‌ కూడా మేలు చేస్తుంది. క్యాప్సికంలో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. ఇది కిడ్నీలను సురక్షితంగా ఉంచుతుంది. కిడ్నీ వ్యాధులు రాకుండా చూస్తుంది.

Admin

Recent Posts