వంకాయల్లో అనేక రకాలు ఉంటాయి. కొన్ని పొడవైనవి, కొన్నిగుండ్రనివి ఉంటాయి. అయితే ఏ రకానికి చెందిన వంకాయ అయినా సరే వాటి రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. వంకాయతో అనేక రకాల కూరలు చేసుకుని తినవచ్చు. ఇక సాంకేతికంగా చెప్పాలంటే వంకాయ కూరగాయల జాతి కాదు, పండ్ల జాతికి చెందుతుంది. అయినప్పటికీ దాన్ని మనం కూరగాయ గానే పరిగణిస్తున్నాం. ఈ క్రమంలోనే వంకాయల వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయల్లో ఫైబర్ (పీచు పదార్థం), నీరు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల జీర్ణాశయం వాపు తగ్గుతుంది. మలబద్దకం సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. వంకాయ సహజసిద్ధమైన లాక్సేటివ్‌గా పనిచేస్తుంది. అంటే విరేచనం సాఫీగా అవుతుందన్నమాట. దీంతో మలబద్దకం సమస్య ఉండదు.
వంకాయల్లో ఆంథో సయనిన్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది.
వంకాయల్లో సాపోనిన్ అనబడే సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చూస్తుంది. అందువల్ల అధిక బరువు తగ్గుతారు. బరువు తగ్గాలనుకునే వారు తమ డైట్‌లో వంకాయను చేర్చుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
రక్తహీనత సమస్య ఉన్నవారు వంకాయలను తింటే మేలు జరుగుతుంది. వీటిల్లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. అలాగే థయామిన్, నియాసిన్, కాపర్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, కె, బి6, పొటాషియం, మాంగనీస్ వంటి పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందువల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. రక్తం బాగా తయారవుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు కూడా పెరుగుతాయి.
వంకాయల్లో ఉండే ఐరన్, కాల్షియంలు ఎముకల ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. వంకాయల్లోని ఫినోలిక్ సమ్మేళనాలు ఆస్టియోపోరోసిస్ రాకుండా చూస్తాయి. ఎముకలను దృఢంగా మారుస్తాయి. ఎముకల సాంద్రతను పెంచుతాయి. దీంతో ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.
వంకాయల్లో ఉండే ఫైటో న్యూట్రియెంట్స్, పొటాషియంలు మెదడుకు ఆక్సిజన్ సరఫరాను పెంచుతాయి. దీంతో ఫ్రీ ర్యాడికల్స్ నశిస్తాయి. మెదడులోని రక్త నాళాలు వెడల్పుగా మారుతాయి. మెదడుకు రక్త సరఫరా పెరుగుతుంది. దీని వల్ల మెదడు యాక్టివ్‌గా మారుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
వంకాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, ఆంథో సయనిన్స్ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి. క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. వంకాయల్లో ఉండే సోలాసోడైన్ రమ్నోసైల్ గ్లైకోసైడ్స్ అనబడే సమ్మేళనాలు క్యాన్సర్ కణాలను నిర్మూలిస్తాయి. దీని వల్ల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365