Ivy Gourd Benefits : ఆరోగ్యానికి దొండకాయ ఎంతో మేలు చేస్తుంది. చాలామందికి దొండకాయ వలన కలిగే లాభాలు గురించి తెలియదు. దొండకాయలో పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి. అలానే, విటమిన్ బి వన్, బి టు, బి త్రీ, బి 6 , బి 9 , విటమిన్ సి కూడా దొండకాయలో ఉంటాయి. పిండి పదార్థాలు, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్, సోడియం, జింక్ వంటి పోషకాలు దొండకాయలులో ఉంటాయి. దొండకాయలను తీసుకోవడం వలన, రక్తహీనత సమస్య కూడా ఉండదు. శక్తిని కూడా దొండకాయ పెంచుతుంది. అయితే, దొండకాయను తీసుకోవడం వలన మతిమరుపు, మంద బుద్ధి వంటి సమస్యలు వస్తాయని, చాలామంది భావిస్తారు.
కొన్ని తరాలుగా ఇది అందరిలో ఉండిపోయింది. కానీ, అలా దొండకాయను తినడం వలన నష్టాలు కలుగుతాయి అన్న దానికి శాస్త్రీయమైన ఆధారాలు అయితే లేవు. దొండకాయని తీసుకోవడం వలన తెలివితేటలు పెరుగుతాయని, కొన్ని అధ్యయనాల్లో తేలింది. డైటరీ ఫైబర్ కూడా దొండలో ఎక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ గా మార్చేందుకు ఇందులో ఉండే థైమన్ సహాయపడుతుంది. జీర్ణక్రియ సజావుగా సాగుతుంది.
దొండకాయని తీసుకుంటే, పేగుల నుండి వ్యర్ధపదార్థాలని, విష పదార్థాలని ఈజీగా బయటికి పంపిస్తుంది. ఫ్రీగా మోషన్ అవ్వడానికి కూడా ఇది సాయం చేస్తుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అల్సర్, గ్యాస్ వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి.
కిడ్నీలో రాళ్లు సమస్యతో, చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు, వారానికి రెండుసార్లు దొండకాయను తీసుకుంటే మంచిది. రాళ్లు ఏర్పడ్డడాన్ని నియంత్రిస్తుంది అలానే దొండలో ఉండే కొన్ని పదార్థాలు డయాబెటిస్ ని తగ్గిస్తాయి. దొండకాయని తీసుకోవడం వలన ఆస్తమా, పచ్చకామెర్లు వంటివి కూడా తగ్గుతాయి. చూసారు కదా, దొండకాయలని తీసుకుంటే ఎన్ని లాభాలు ఉంటాయనేది. ఈసారి రెగ్యులర్ గా తీసుకుంటూ వుండండి. సమస్యలేమీ రావు.