Spring Onions : మనం నిత్యం కూరల్లో ఉల్లిపాయలను వేస్తుంటాం. అయితే మనకు ఉల్లికాడలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఉల్లిపాయలు పూర్తిగా పెరగక ముందే మొక్కగా ఉన్న సమయంలో ఉల్లికాడలను సేకరిస్తారు. వీటిని మనం కూరల్లో వేసుకోవచ్చు. అయితే వీటిని చాలా మంది ఉపయోగించరు. కానీ వీటి వల్ల మనకు అనేక అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఉల్లికాడలను రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఉల్లి కాడల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. కనుక బాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. జ్వరం నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే దగ్గు, జలుబు కూడా తగ్గుతాయి. ఉల్లికాడలతో సూప్ తయారు చేసి తీసుకుంటే ఆయా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సీజనల్ వ్యాధులను తగ్గించడంలో ఉల్లికాడలు ఎంతగానో మేలు చేస్తాయి.
2. ఉల్లికాడలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అజీర్ణం అన్న సమస్యే ఉండదు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్, కడుపులో మంట, మలబద్దకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
3. ఉల్లికాడలను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల క్యాన్సర్ కణాల పెరుగుదల ఆగిపోతుంది. దీంతో క్యాన్సర్లు రాకుండా నివారించవచ్చు. అలాగే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. మధుమేహం ఉన్నవారికి ఉల్లికాడలు చేసే మేలు అంతా ఇంతా కాదు. వారు వీటిని రోజూ తినాలి.
4. ఉల్లికాడల్లో ఉంటే యాంటీ ఆక్సిడెంట్లు కంటి చూపును మెరుగు పరచడమే కాకుండా.. రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తాయి. దీంతో వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.
5. ఉల్లికాడలను తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా నివారించవచ్చు. అలాగే జీర్ణ సంబంధ సమస్యలు కూడా రావు. కనుక ఉల్లికాడలను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. దీంతో అనేక లాభాలను పొందవచ్చు.