Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

భారతదేశ చరిత్రలో అత్యంత అందమైన 5 మహారాణులు వీరు తెలుసా..?

Admin by Admin
December 8, 2024
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మన దేశంలో ఒకప్పుడు ఆయా ప్రాంతాలను ఎంతో మంది రాజులు పాలించేవారు. అనంతరం రాను రాను రాజరిక వ్యవస్థ పోయి ప్రజాస్వామిక వ్యవస్థ వచ్చింది. అయితే అలా వచ్చే క్రమంలోనూ మన దేశంలోనూ అక్కడక్కడ ఇంకా రాజరికపు పోకడలు పోలేదు. ఆయా రాజుల సంస్థానాలు మన దేశంలో విలీనం అయ్యేందుకు చాలా కాలం పట్టింది. అయితే రాజుల సంగతి పక్కన పెడితే అప్పట్లో పలువురు రాణులు మాత్రం చాలా అందగత్తెలుగా భారతదేశ చరిత్రలో పేరు తెచ్చుకున్నారు. అలాంటి రాణుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. మహారాణి గాయత్రి దేవి

1919 మే 23వ తేదీన ఈమె జన్మించింది. 2009 జూలై 29వ తేదీన మృతి చెందింది. 1960లలో ప్రపంచంలోనే అందమైన మహిళగా గుర్తింపు పొందింది. ఈమె యూరప్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసింది. అప్పట్లోనే మహిళా ప్రపంచానికి ఈమె ఫ్యాషన్‌ ఐకాన్‌గా ఉండేది. ఈమెకు హార్స్‌ రైడింగ్‌ అంటే ఎంతగానో ఇష్టం. గుర్రాల మీద రైడింగ్‌ చేస్తూ ఆడే పోలో ఆటలో ఈమె నిపుణురాలు. కార్లన్నా ఈవిడకు ఇష్టమే. మెర్సిడెస్‌ బెంజ్‌ డబ్ల్యూ126 అనే ఓ కారును ఈమె అప్పట్లో ఇండియాకు తెప్పించి వాడారు. ఇక ఈవిడకు సామాజిక స్పృహ కూడా ఎక్కువగానే ఉండేది. మహిళల విద్య కోసం ఈమె పాటు పడేవారు.

5 famous queens in indian history with their beauty

2. బరోడా రాణి ఇందిరా రాజే

1892, ఫిబ్రవరి 19న జన్మించిన ఈమె 1968, సెప్టెంబర్‌ 6న మరణించింది. ఈమె అందం వర్ణించరానిదిగా ఉండేది. 18వ ఏట రాజు జితేంద్రతో ఈమెకు వివాహం అయింది. అయితే ఈమెకు 5 మంది సంతానం కలిగాక అతను మృతి చెందాడు. అయినప్పటికీ తనకు ఎదురైన సవాళ్లను ఈమె అధిగమించింది.

3. బరోడా రాణి సీతా దేవి

1917, మే 12న జన్మించిన ఈమె 1989 ఫిబ్రవరి 15వ తేదీన మృతి చెందింది. వయ్యూర్‌ జమీందార్‌ను ఈమె వివాహం చేసుకుంది. ముగ్గురు సంతానం కలిగారు. అయితే ఈవిడ భర్త బ్యాంకుల నుంచి వడ్డీ లేని రుణాలు పొందారనే అపవాదు ఉండేది. కానీ 1951లో ఈమె తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. అయినా రాయల్‌గానే జీవించడం మొదలు పెట్టింది. అయితే ఈమె ఒక్కగానొక్క కుమారుడు సూసైడ్‌ చేసుకున్నాక ఈవిడ తన జీవితంలో చివరి నాలుగేళ్లు తీవ్ర మనస్థాపంతో జీవించింది.

4. కపుర్తల రాణి సీతా దేవి

1915లో జన్మించిన ఈమె 2002లో మృతి చెందింది. భారతదేశంలో అత్యంత అందమైన రాణిగా ఈవిడ గుర్తింపు పొందారు. 13వ ఏట ఈమెకు సిఖ్‌ మహారాజు కొడుకుతో వివాహం అయింది. ఈమెకు పలు యురోపియన్‌ భాషలు తెలుసు. 19వ ఏట ప్రముఖ వోగ్‌ మ్యాగజైన్‌ ఈమెకు సెక్యులర్‌ గాడెస్‌ బిరుదు ఇచ్చింది.

5. హైదరాబాద్‌ రాణి నీలోఫర్‌

ప్రపంచంలోనే అత్యంత అందమైన రాణుల్లో ఈమె ఒకరుగా గుర్తింపు పొందింది. అయితే ఈమెకు సామాజిక స్పృహ ఎక్కువ. సమాజానికి చెందిన పలు కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనేది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఈమె మహిళల హక్కుల కోసం తీవ్రంగా పోరాడింది. అంతేకాదు ఆ సమయంలో నర్స్‌ ట్రెయినింగ్‌ తీసుకుంది. అందులో భాగంగానే మహిళలకు సేవ చేసేందుకు హైదరాబాద్‌ నగరంలో ఓ హాస్పిటల్‌ను ఏర్పాటు చేసింది. అందులో మహిళలకు, పిల్లలకు ఉచితంగా వైద్య సేవలు లభించేవి. 1989వ సంవత్సరంలో ఈమె మృతి చెందింది.

Tags: indian queens
Previous Post

కార్న్ ఫ్లేక్స్ ఆరోగ్యానికి మంచివేనా..?

Next Post

కొత్త సంవత్సరంలో చాలా మంది తీసుకునే అతి ముఖ్యమైన 5 నిర్ణయాలు ఇవే..!

Related Posts

వినోదం

బాహుబ‌లి పాత్ర కోసం…ప్ర‌భాస్…తీసుకున్న బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్న‌ర్..లిస్ట్ ఇదిగో ఇంత‌లా ఉంది!?

July 14, 2025
technology

నాణ్య‌మైన ఫొటోలు, వీడియోలు కావాలంటే స్మార్ట్‌ఫోన్ కెమెరాలో ఇది ఉండాలి..!

July 14, 2025
technology

USB Type-C అంటే ఏమిటో… దాని వ‌ల్ల మ‌న‌కు ఉపయోగాలేంటో తెలుసా..?

July 14, 2025
హెల్త్ టిప్స్

షుగ‌ర్ వ్యాధి ఉన్న‌వారు దూర ప్ర‌యాణం చేయ‌కూడదా..?

July 14, 2025
వైద్య విజ్ఞానం

గుండె జ‌బ్బు వ‌స్తుంద‌ని అనుమానంగా ఉందా..? అయితే ఈ టెస్టులు త‌ప్ప‌నిస‌రి..!

July 14, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

పురుషులు ప్ర‌తి 3 రోజుల‌కు ఒక‌సారి ఒక అర‌టి పండును తినాల‌ట‌.. ఎందుకంటే..?

July 14, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.