Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

త‌ల‌నొప్పి ట్యాబ్లెట్ కోసం వ‌చ్చిన వ్య‌క్తికి ఆ సేల్స్‌మాన్ ఏమేం అమ్మాడో తెలిస్తే షాక‌వుతారు..!

Admin by Admin
June 28, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఒక ఉద్యోగి ఇండియాలో తాను చేసే జాబ్ విసుగొచ్చి రిజైన్ చేసి లండన్ లో అతిపెద్ద మాల్ లో ఒక సేల్స్ మాన్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నాడు. అది ప్రపంచంలోనే అతి పె ద్ద మాల్. అక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు. ఇంతకు ముందు సేల్స్ మాన్ గా ఎక్కడైనా పనిచేసావా ? అడిగాడు బాస్. చెయ్యలేదు. సరే ! రేపు వచ్చి జాయిన్ అవ్వు. నీ పెర్ఫార్మన్స్ నేను స్వయంగా చూస్తా!. తర్వాతి రోజు చాలా భారంగా నడిచింది తనకి. చివరకి సాయంత్రం ఆరు గంటలకి బాస్ వచ్చాడు. ఈ రోజు ఎంత మంది క‌స్ట‌మ‌ర్స్‌ కి సేల్స్ చేశావు?. సర్ ! కేవలం ఒకరు అని బదులిచ్చాడు తను. ఒకటేనా ! నువ్వు ఇక్కడ గమనించావా, అందరూ 40 నుండి 50 సేల్స్ చేస్తారు. సరే, ఎంత ఖరీదైన సేల్ నువ్వు చేశావో చెప్పు?

8,009,770 పౌండ్స్ చెప్పాడు మన సేల్స్ మాన్. వాట్ !! అదిరిపడ్డాడు బాస్. అంత పెద్ద సేల్ ఏమి చేశావు? అడిగాడు. వినండి. ఒక పెద్దాయనకి ఒక చేపలు పట్టే పెద్ద గేలం అమ్మాను. గాలం ఖరీదు నువ్వు చెప్పినంత ఎక్కువ ఖరీదు కాదే? అన్నాడు బాస్. పూర్తిగా వినండి, తర్వాత ఆ గాలానికి సరిపడే రాడ్, ఒక గేర్ అమ్మాను. ఎక్కడ చేపలు పట్టాలనుకుంటున్నారో అడిగితే దూరంగా నది ఒడ్డున అని చెప్పారు. దాని కన్నా ఒక బోట్ లో వెళుతూ నది మధ్య చేపలు పడితే బాగుంటుందని ఒప్పించి బోట్ స్టోర్లో ఒక షూనర్ బోట్ డబల్ ఇంజన్ ఉన్నది కొనిపించాను. ఆ పెద్దమనిషి తన జీప్ కెపాసిటీ తక్కువ ఈ బోట్ ని తీసుకు పోలేదు అన్నారు. అప్పుడు ఆటొమోబైల్ డిపార్ట్మెంట్ లో ఒక కొత్త డీలెక్స్ బ్లాజర్ కొనిపించాను.

what this salesman sold to that man who went to store for headache

తరువాత అక్కడే నది ఒడ్డున ఉండటానికి కాంపింగ్ డిపార్ట్మెంట్ లో కొత్తగా వ‌చ్చిన ఆరు స్లీపర్ల ఇగ్లూ కాంప్ టెంట్ దానిలో ఉండటానికి కావల్సిన భోజన సామగ్రి పాక్ చేయించాను. బాస్ ఆశ్చర్యంతో రెండు అడుగులు వెనక్కి వేశాడు. ఇవన్నీ ఒక గేలం కొనడానికి వచ్చిన వాడితో కొనిపించావా !!! లేదు సార్ ! బదులు ఇచ్చాడు సేల్స్ మాన్. మరి ? అన్నాడు బాస్. ఆయన నిజానికి ఒక తల నొప్పి టాబ్లెట్ కోసం వచ్చారు. తలనొప్పికి టాబ్లెట్ కన్నా చేపలు పట్టే హాబీ ద్వారా తగ్గించుకోవచ్చు అని ఒప్పించాను. బాస్: అరే యార్ …!! ఇంతకీ నువ్వు ఇండియాలో ఏం ఉద్యోగం చేసేవాడివి? అప్పుడు ఆ సేల్స్ మాన్ చెప్పాడు. కార్పొరేట్ స్కూల్, విద్యా సంస్థలలో టీచర్ ఉద్యోగం చేసేవాణ్ణి సార్. టీచర్ కి, సేల్స్ కు, ఏంటి రిలేషన్?? అడిగాడు బాస్. ఏబిసిడి లు నేర్పమని వస్తే , పదేళ్ల తర్వాత వచ్చే ఐఐటి – నీట్-సివిల్స్ , రాంక్ పేరు మీద ఫీజులు వసూలు చేసేవాళ్ళం… అని ఆన్సర్ ఇచ్చాడు. బాస్ నివ్వెర‌పోయాడు.

Tags: tablet
Previous Post

ఆస్తి కోసం తండ్రితో గొడ‌వ‌ప‌డ్డ కూతుళ్లు.. ఆస్తి ప‌త్రాల‌ను హుండీలో వేసిన తండ్రి..

Next Post

కేరాఫ్ కంచరపాలెం సినిమా మీద క్లైమాక్స్ ట్విస్ట్ తప్పించి మరేమీ లేదు అన్న విమర్శ ఉంది దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?

Related Posts

information

పొర‌పాటున డ‌బ్బును వేరే ఖాతాలోకి ట్రాన్స్‌ఫ‌ర్ చేశారా..? అయితే ఏం చేయాలో తెలుసా..?

July 16, 2025
lifestyle

మీ ఇంట్లో వాట‌ర్ ప్యూరిఫైర్ ఉందా..? అయితే ఇలా చేయండి..!

July 16, 2025
ఆధ్యాత్మికం

హిందూ మ‌తంలో కుమారులు మాత్ర‌మే త‌ల్లిదండ్రుల‌కు ఎందుకు అంత్య‌క్రియ‌లు చేస్తారు..?

July 16, 2025
వినోదం

చిరంజీవి ఫేవరెట్ ఆహారం ఏంటో తెలుసా..?

July 16, 2025
mythology

ప‌ర‌శురాముడి గురించి చాలా మందికి తెలియ‌ని నిజాలు ఇవి..!

July 16, 2025
హెల్త్ టిప్స్

వెల్లుల్లిని దిండు కింద పెట్టుకుని నిద్రిస్తే ఏం జ‌రుగుతుందంటే..?

July 16, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
డ్రింక్స్‌

Oats Chocolate Milk Shake : బాగా ఆక‌లిగా ఉన్న‌ప్పుడు క్ష‌ణాల్లో దీన్ని చేసుకుని తాగండి.. త‌క్ష‌ణ‌మే శ‌క్తి ల‌భిస్తుంది..

by D
October 29, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.