ముంగిసలు, పాములు సహజ శత్రువులు. ఎలుకను చూస్తే ఎలాగైతే పిల్లి చంపి తింటుందో అలాగే పాములను చూస్తే ముంగిసలు కూడా అలాగే పాములను వెంటాడి చంపి తింటాయి. సృష్టి ప్రారంభం అయినప్పటి నుంచి అనేక జాతుల మధ్య వైరాలు ఉన్నట్లే పాము, ముంగిసకు మధ్య జాతి వైరం ఏర్పడింది. అందుకనే పాములను చూస్తే ముంగిసలు రెచ్చిపోతాయి. ఇక పాములు, ముంగిసలు ఒకే రకమైన ఆహారాన్ని తింటాయి. ఎలుకలు, చిన్న జంతువులను తినడం వలన తమ ఆహార వనరులను రక్షించుకోవడానికి వాటిపై దాడి చేస్తాయి.
విషపూరిత పాము ముంగిసను కరిస్తే అది చనిపోవచ్చు. కాబట్టి ఒక పామును చూసినప్పుడు,ముంగీస తనను తాను రక్షించుకోవడానికి దానిపై దాడి చేస్తుంది. ఒక పాము ముంగిస భూభాగంలోకి ప్రవేశిస్తే ముంగిస తమ భూభాగాన్ని రక్షించుకోవడానికి దాడి చేసి దానిని తరిమివేస్తుంది. ముంగిసలలో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. ఈ హార్మోన్ వల్ల ముంగిసలు దూకుడుగా, భయంకరంగా పాముల మీద రెచ్చిపోతాయి.
కో-ఎవల్యూషన్ సిద్ధాంతం ప్రకారం ముంగిసలు, పాములు ఒకదానితో ఒకటి పోటీ పడడం వల్ల ముంగిసలు పాములకు వ్యతిరేకంగా రక్షణగా ఉండే విధంగా అభివృద్ధి చెందాయి. గేమ్ థియరీ సిద్ధాంతం ప్రకారం…. ముంగిసలు పాములతో పోరాడటం ఒక గేమ్ లాంటిది. ముంగిసలు పాములతో పోరాడటం ద్వారా ఆహారం, భద్రతను పొందే అవకాశం ఉంది.