Budimi Pandlu : రోడ్ల పక్కన, పొలాల దగ్గర, చేల కంచెల వెంబడి అలాగే ఖాళీ ప్రదేశాల్లో అనేక రకాల మొక్కలు పెరుగుతాయి. ఇలా ఎక్కడపడితే అక్కడ విరివిరిగా పెరిగే మొక్కల్లో బుడిమి కాయ మొక్క కూడా ఒకటి. దీనిని బుడ్డకాయ, కుప్పంటి అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఈ మొక్కలో చాలా రకాలు ఉంటాయి. ఈ మొక్క మృదువైన ఆకులతో, చిన్న చిన్న కాయలతో కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ మొక్క రెండున్నర అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. చాలా మంది ఈ మొక్కను చూసే ఉంటారు. కానీ అందరూ దీనిని పిచ్చి మొక్క అనే అనుకుంటారు. కానీ ఈ బుడిమి కాయ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ మొక్క కాయలను కొన్ని ప్రాంతాల్లో తింటూ ఉంటారు. ఈ కాయలను తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
ఆయుర్వేదంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఈ మొక్కను ఔషధంగా ఉపయోగిస్తారు. ఈ కాయల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, మాంగనీస్, ఫైబర్ వంటి పోషకాలు అధికంగా ఉన్నాయి. అలాగే వీటిలో కెరటనాయిడ్స్, పాలీఫినాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు కూడాఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరంలో దీర్ఠకాలికంగా వేధించే అనారోగ్య సమస్యలను, మోకాళ్ల నొప్పులను, కీళ్ల నొప్పులను తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ బుడిమి పండ్లను తినడం వల్ల ఊబకాయం సమస్య నుండి కూడా బయటపడవచ్చు. అలాగే వీటిని తీసుకోవడం వల్ల గుండె చక్కగా పని చేస్తుంది. కాలేయం మరియు మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది.
ఈ బుడిమి పండ్లను తీసుకోవడం వల్ల ముఖ్యంగా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో అనారోగ్య సమస్యయ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. షగుర్ వ్యాధి గ్రస్తులకు కూడా ఈ పండ్లు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. క్యాన్సర్ బారిన పడే అవకాశాలను కూడా ఈ పండ్లు తగ్గిస్తాయి. ఈ బుడిమి పండ్లను తీసుకోవడం వల్ల కంటి సంబంధిత సమస్యలు తగ్గి కంటి చూపు మెరుగుపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరచడంలో , శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
హైబీపీతో బాధపడే వారు ఈ పండ్లను తీసుకోవడం వల్ల బీపీ కూడా నియంత్రణలో ఉంటుంది. అయితే ఈ కాయలను తీసుకునేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలను పాటించాలి. ఈ బుడిమి కాయలను పూర్తిగా పండిన తరువాత మాత్రమే తీసుకోవాలి. పచ్చి కాయలను అస్సలు తీసుకోకూడదు. అలాగే కొందరికి ఈ పండ్లను తినడం వల్ల అలర్జీలు వచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే గర్భిణీస్త్రీలు, పాలిచ్చే తల్లులు వీటిని తీసుకోకపోవడమే మంచిది. ఈ విధంగా బుడిమి కాయల చెట్టు మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ పండ్లను తీసుకోవడం వల్ల మనం మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.