సాధారణంగా మనలో కలిగే ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడానికి ఆయుర్వేదంలో గత కొన్ని సంవత్సరాల నుంచి తిప్పతీగను ఎంతో విరివిగా ఉపయోగిస్తున్నారు. తిప్పతీగ ద్వారా వివిధ రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. తిప్పతీగలో ఎన్నో రకాల పోషక పదార్థాలు, స్టెరాయిడ్లు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా లభిస్తాయి.
ఎన్నో సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో ఎంతో విరివిగా ఉపయోగించే ఈ తిప్పతీగలను ఉపయోగించడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగు పరుచుకోవచ్చు. ఈ తిప్పతీగలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల ఇవి మన శరీరంలో పేరుకుపోయిన ఫ్రీరాడికల్స్ ను బయటకు పంపించడంలో దోహదపడతాయి. అజీర్తి సమస్యతో బాధపడే వారికి తిప్పతీగల చూర్ణం ఒక వరం అని చెప్పవచ్చు.
తిప్పతీగ చూర్ణం గుళికల రూపంలో ప్రతిరోజు వేసుకోవటం వల్ల ఆర్థరైటిస్ నొప్పి నుంచి విముక్తి పొందవచ్చు. అదేవిధంగా జ్ఞాపక శక్తిని పెంపొందించడానికి తిప్పతీగలు కీలక పాత్ర పోషిస్తాయి. తిప్పతీగలో ఉండే పోషకాలు మూత్రాశయంలో ఏర్పడిన ఇన్ఫెక్షన్లను తొలగించడానికి దోహదపడతాయి. ఇందులో ఉన్నటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మనలో కలిగి ఉన్న ఒత్తిడిని తరిమికొట్టి జ్ఞాపక శక్తిని పెంపొందించడానికి దోహదపడుతుంది.