Neerugobbi Chettu : వర్షాకాలంలో నీటి గుంటల్లో ఎక్కువగా పెరిగే చెట్లల్లోనీరు గొబ్బి చెట్టు ఒకటి. ఈ చెట్టును మనలో చాలా మంది చూసే ఉంటారు. అయితే ఈ చెట్టును అందరూ పిచ్చి చెట్టు అని భావిస్తూ ఉంటారు. కానీ నీరు గొబ్బి చెట్టులో వంద రోగాలను సైతం నయం చేసే శక్తి ఉంది. ఈ మొక్క వల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్నీ కావు. నీరు గొబ్బి చెట్టులో ఉండే ఔషధ గుణాల గురించి అలాగే ఈ మొక్క వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నీరు గొబ్బి చెట్టును సంస్కృతంలో కోకిలాక్షా అని పిలుస్తారు. అలాగే ఈ చెట్టుకు వాడి గల ముళ్లులు ఉంటాయి. అలాగే నలుపు, తెలుపు, ఊదా రంగుల్లో పూలు కూడా ఉంటాయి. ఈ చెట్టు తియ్యటి రుచిని అలాగే శరీరానికి చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది.
శరీరంలో వచ్చే వాత, కఫ రోగాలను తొలగించడంలో ఈ నీరు గొబ్బి చెట్టు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో ఈ చెట్టు గింజలను ఎక్కువగా ఉపయోగిస్తారు. నీరు గొబ్బి చెట్టు గింజలను, దూలగొండి గింజలను సమానంగా తీసుకోవాలి. అవి మునిగే వరకు ఆవు పాలను పోసి పాలు అయిపోయే వరకు మరిగించాలి. తరువాత వీటిని ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. ఈ పొడికి సమానంగా పటిక బెల్లం పొడిని కలిపి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని రెండుపూటలా ఒక టీ స్పూన్ మోతాదులో ఒక గ్లాస్ పాలల్లో కలిపి తీసుకోవడం వల్ల పురుషుల్లో వీర్య కణాల సంఖ్య పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
గొబ్బి చెట్టు వేరును, పల్లేరు చెట్టు వేరును, ఆముదం చెట్టు వేరును సేకరించి మూడింటిని విడివిడిగా ఎండబెట్టి పొడిగా చేసుకుని సమానంగా కలిపి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని రెండు పూటలా అర టీస్పూన్ మోతాదులో అర కప్పు వేడి పాలల్లో కలిపి తాగడం వల్ల మూత్రపిండాల్లో ఉన్న రాళ్లు కరిగిపోతాయి. ఈ గొబ్బి చెట్టు వేరును మాడుపై ఉంచి ఊడిపోకుండా వస్త్రంతో కట్టుకట్టాలి. నిద్రపోయే ముందు ఇలా కట్టుకోవడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గి నిద్ర బాగా పడుతుంది. నీరు గొబ్బి చెట్టును సమూలంగా సేకరించి దానికి సమానంగా తిప్ప తీగ కాడలను కలిపి కషాయం తయారు చేసుకోవాలి. ఈ కషాయాన్ని రోజూ 30 నుండి 60 ఎమ్ ఎల్ మోతాదులో తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న వాత రోగాలన్ని తొలగిపోతాయి.
అలాగే ఈ మొక్కను సమూలంగా సేకరించి ఎండబెట్టి కాల్చి బూడిద చేసుకోవాలి. ఈ బూడిదను అర టీ స్పూన్ మోతాదులో తీసుకుని నీటిలో కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో ఉండే వాపులు తగ్గుతాయి. ఈ ఆకుల రసాన్ని రోజూ పరగడుపున రెండు టీ స్పూన్ల మోతాదులో తీసుకోవడం వల్ల మూత్రపిండాల వైఫల్యం సమస్యతో బాధపడే వారి మూత్రపిండాలు కూడా చక్కగా పని చేస్తాయి. నీరు గొబ్బి గింజల పొడిని, దూలగొండి గింజల పొడిని సమానంగా ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని అప్పుడే పితికిన ఆవుపాలల్లో కలిపి తాగుతూ ఉంటే పురుషుల్లో వచ్చే శీఘ్రస్కలనం సమస్య తగ్గి లైంగిక సామరథ్యం పెరుగుతుంది. ఈ మొక్కను సమూలంగా సేకరించి దంచి రసాన్ని తీయాలి. ఈ రసానికి సమానంగా ఆముదం నూనెను కలిపి నూనె మిగిలే వరకు వేడి చేయాలి.
ఇలా తయారు చేసుకున్న నూనెను నొప్పులు ఉన్న చోట చర్మం పై రాసి మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల నొప్పులన్ని తగ్గుతాయి. గొబ్బి చెట్టు వేరును సేకరించి దానితో కషాయాన్ని తయారు చేసుకోవాలి. ఈ కషాయాన్ని రోజూ రెండు పూటలా 50 ఎమ్ ఎల్ మోతాదులో తీసుకోవడం వల్ల అన్ని రకాల మూత్ర సమస్యలు తగ్గుతాయి. ఈ మొక్క వేరును దంచి అర కప్పు నీటిలో కలిపి తీసుకోవడం వల్ల స్త్రీలల్లో వచ్చే తెల్లబట్ట సమస్య తగ్గుతుంది. ఈ చెట్టు గింజల పొడిని 2 గ్రాముల మోతాదులో తీసుకుని దానిని అర కప్పు కుండ నీటిలో కలిపి రోజూ ఉదయం పరగడుపున తాగాలి.
ఇలా చేయడం వల్ల స్త్రీలల్లో నెలసరి సమయంలో వచ్చే అధిక రక్తస్రావం సమస్య తగ్గుతుంది. నెలసరి కూడా సక్రమంగా వస్తుంది. నీరు గొబ్బి చెట్టును అలాగే ఇతర ఔషధ మొక్కలనుఉపయోగించి చేసే మదనకామేశ్వరీ చూర్ణాన్ని రోజూ రెండు పూటలా ఒక టీ స్పూన్ మోతాదులో ఒక టీ స్పూన్ తేనె, ఒక టీ స్పూన్ ఆవు నెయ్యిని కలిపి తీసుకోవాలి. వెంటనే వేడి వేడి ఆవు పాలను తాగాలి. ఇలా చేయడం వల్ల పురుషుల్లో అంతులేనంత శారీరక బలం కలుగుతుంది. ఈ విధంగా నీరు గొబ్బి చెట్టు మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని ఉపయోగించడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.