Shankhpushpi Plant : చాలా ఔషధ మొక్కలు, మనకి అందుబాటులో ఉంటాయి. ఔషధ మొక్కల వలన, అనేక అనారోగ్య సమస్యలను పరిష్కరించుకోవచ్చు. శంఖ పుష్పం గురించి, కొత్తగా చెప్పక్కర్లేదు. మన చుట్టుపక్కల ఇది దొరుకుతూ ఉంటుంది. ఈ మొక్కలు ఆసియా ఖండానికి, చెందిన ప్రపంచమంతా కూడా ఈ మొక్కలు విస్తరించాయి. ఈ చెట్టు గుబురుగా ఉంటుంది. ఈ చెట్టు పొలాల కంచల వెంట, రహదారులకి డొంకలకు ఇరువైపులా బాగా మనకి కనబడుతుంటాయి. పుష్పాలు తో అనేక లాభాలు ఉంటాయి. చాలామందికి శంఖ పుష్పాల వలన కలిగే లాభాలు తెలియదు.
ఈ పూల ని ఆయుర్వేదంలో ఎప్పటినుండో వాడుతున్నారు. అనేక రోగాలకి చికిత్సగా ఉపయోగిస్తున్నారు. భూసారాన్ని పెంచడానికి, కొన్ని ప్రాంతాలలో దీనిని ఉపయోగించడం జరుగుతుంది. ఈ శంఖ పుష్పాలను వివిధ దేవతలకు జరిపే పూజల్లో కూడా వాడుతూ ఉంటారు. శంఖ పుష్పాలతో పూజ చేయడం వలన, డబ్బుకి ఎలాంటి లోటు ఉండదట. శ్రీమహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన, ఈ తీగ మొక్క పుష్పాలు దేవతారాధనకి ఉపయోగపడతాయి. చాలామంది, మొక్కల్ని ఇళ్లల్లో కూడా పెంచుకుంటూ ఉంటారు.
ఆర్థిక ఇబ్బందుల్ని తొలగిస్తుంది. ఈ మొక్క ఉంటే, శనీశ్వరుడి అనుగ్రహం కూడా కలుగుతుందట. ఈ పూలు నీలం రంగులో ఉంటాయి. ఈ పూల మొక్క కనుక ఇంట్లో ఉందంటే, డబ్బులు బాగా సంపాదిస్తారట. డబ్బు విషయం లో ఎలాంటి లోటు కూడా ఉండదట.
సోమవారం నాడు 5 శంఖ పుష్పాలను తీసుకుని, నదిలో కానీ పారే నీటి లో కానీ కలపాలి. ఇలా చేస్తే, ఆర్థిక బాధలు తొలగిపోతాయి. డబ్బు కొరత కూడా ఉండదు. మంగళవారం నాడు, హనుమంతుడికి ఈ పుష్పాలతో పూజ చేస్తే ధనవంతులు అయిపోవచ్చు. ఇలా, ఈ మొక్క ద్వారా అనేక లాభాలని పొందవచ్చు. ముఖ్యంగా, ఈ మొక్క ఇంట్లో ఉంటే లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుంది.