Milk : మనం పాలను ప్రతిరోజూ ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పాలను తాగడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. మనం ఆవు పాలను అలాగే గేదె పాలను ఆహారంగా తీసుకుంటాం. ఇవి రెండు కూడా శ్రేష్ఠమైనవే. కానీ చాలా మంది ఏ పాలను తీసుకోవాలో తెలియని సందేహంలో ఉంటారు. అయితే ఈ రెండింటిలో వేటిని తీసుకోవడం వల్ల మనం అధిక ప్రయోజనాలను పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఆవు పాలు పసుపు పచ్చగా ఉంటాయి. గేదె పాలు తెల్లగా ఉంటాయి. అందువల్ల వీటిని బంగారం, వెండి అని అంటారు.
ఆవు మూపురంలో స్వర్ణనాడి ఉంటుంది. అందుకే ఆవు పాలల్లో బంగారత్వతం ఇమిడి ఉంటుంది. ఆవు దూడ పుట్టిన మూడు రోజులకే గంతులు వేస్తుంది. అదే గేదె దూడ అయితే పుట్టిన 30 రోజుల తరువాత గంతులు వేస్తుంది. ఈ కారణం చేత ఆవు పాలను తాగడం వల్ల మనం చురుకుగా ఉంటామని గేదె పాలను తాగడం వల్ల మనం బద్దకంగా ఉంటామని నిపుణులు చెబుతున్నారు. అలాగే 500 పశువుల మధ్య విడిచిపెట్టినా సరే ఆవు దూడ అవలీలగా తన తల్లిని చేరుకుంటుంది. అదే గేదె దూడ పది గేదెల మధ్య విడిచిపెట్టినా కూడా తన తల్లిని గుర్తించలేదు. దీనిని బట్టి ఆవు పాలను తీసుకోవడం వల్ల తెలివితేటలు పెరుగుతాయని మనం అర్థం చేసుకోవచ్చు.

ఆవులకు కానీ వాటి దూడలకు కానీ మనం ఏదైనా పేరు పెట్టి పిలిస్తే వెంటనే ప్రతి స్పందించి పిలిచిన వారి వద్దకు వస్తాయి. కానీ గేదెలకు వాటి దూడలకు ఈ జ్ఞానం శూన్యం. ఆవులు ఎక్కడ విడిచి పెట్టిన సరే సమయానికి వాటి స్థానానికి చేరుకుంటాయి. గేదెలకు స్థలము, సమయం, గుంపు అన్న గుర్తింపు ఉండవు. భారతీయ గోవు తీవ్రమైన ఎండలనైనా సహిస్తుంది. అందుకే దీని పాలు రోగ రహితం. ఆరోగ్యవంతం. కానీ గేదెలు వేడిని తట్టుకోలేవు. ఆవు పాలు గుండె జబ్బులు ఉన్న వారికి ఎంతో సహాయపడతాయి. కానీ గేదె పాలల్లో ఉండే కొవ్వు రక్తనాళాల్లో చేరి క్రమంగా హృద్రోగాలకు దారి తీస్తుంది.
ఆవు పాలల్లో ఉండే పసుపు పచ్చని పదార్థం కళ్లల్లో ఉండే కాంతిని మెరుగుపరుస్తుంది. కళ్ల కలక వచ్చినప్పుడు ఆవు పాలలో వస్త్రాన్ని ముంచి దానిని కళ్లపై ఉంచుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. ఆవుల్లో కూడా వివిధ రకాలు ఉంటాయి. తెల్ల రంగులో ఉండే ఆవు పాలు వాతాన్ని, నల్ల కపిల ఆవు పాలు పిత్తాన్ని, ఎరుపు రంగు ఆవు పాలు కఫాన్ని తొలగిస్తాయి. ఆవు పాలు సర్వరోగ నివారిణి మాత్రమే కాదు అవి వృద్ధాప్యం వల్ల వచ్చే ముడతలను కూడా తొలగిస్తాయి.
అభివృద్ది చెందిన దేశాల్లో ఆవులను పెద్ద సంఖ్యలో పెంచుతున్నారు. కొన్ని దేశాల్లో గేదెలు జంతు ప్రదర్శన శాలలో మాత్రమే కనిపిస్తాయి. మన దేశంలో కూడా ఆవులకు సరైన మేత, పాలను వృద్ధి చేసే విధానంపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఆవు పాలు, పెరుగు, నెయ్యితో అనేక వ్యాధులను నయం చేయవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో కూడా గోవు ఉత్పత్తులకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అయితే బరువు పెరగాలనుకునే వారు ఆవు పాల కంటే గేదె పాలను తాగడం మంచిది.